Half Day Schools : ఎండల ఎఫెక్ట్ .. ఆప్‌ డే స్కూల్స్‌ వేళల్లో మార్పు .. కొత్త టైమింగ్స్‌ .. !

Authored By Sudheer Ramanujam | The Telugu News | Updated on : 13 April 2026, 12:30 pm
  •  Half Day Schools : ఎండల ఎఫెక్ట్ .. ఆప్‌ డే స్కూల్స్‌ వేళల్లో మార్పు .. కొత్త టైమింగ్స్‌ .. !

Half Day Schools : రాష్ట్రంలో రోజురోజుకీ ఎండ తీవ్రత మరింత పెరుగుతోంది. భానుడి ప్రతాపం అధికమవడంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల వడగాల్పులు వీస్తుండగా ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల తర్వాత బయటకు వెళ్లడం కూడా కష్టంగా మారింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వేడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇళ్లలోనే ఉండేందుకు మొగ్గుచూపుతున్నారు. వాతావరణ శాఖ కూడా రానున్న రోజుల్లో ఎండలు ఇంకా పెరిగే అవకాశముందని హెచ్చరికలు జారీ చేస్తోంది.

change the half day schools timing ..!

change the half day schools timing ..!

Half Day Schools : ఒంటిపూట బడులపై ఆందోళనలు

వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇప్పటికే ఒంటిపూట బడులను అమలు చేస్తోంది. మార్చి 16 నుంచి ఈ విధానం కొనసాగుతుండగా ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు క్లాసులు కొనసాగిస్తున్నాయి. అయితే బడి ముగిసే సమయానికి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు వేడి తట్టుకోలేక అలసటకు గురవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పాఠశాలల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉదయం పాఠశాల ప్రారంభ సమయంలో రాగిజావ ఇవ్వడం తరగతులు ముగిసిన తర్వాత మధ్యాహ్న భోజనం అందించడం వంటి చర్యలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ విద్యార్థులు ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటమే ప్రధాన సమస్యగా మారింది.

Half Day Schools : వేళల మార్పుపై వినతులు

పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు ప్రభుత్వం వద్ద కొత్త డిమాండ్లు చేస్తున్నారు. ఒంటిపూట బడుల సమయాన్ని మరింత తగ్గించాలని కోరుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటలకే పాఠశాలలు ముగించాలని మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ సూచించింది. ప్రస్తుతం నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించబడ్డాయి. ఇప్పటికే పలు పాఠశాలల్లో పరీక్షలు జరుగుతుండగా పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ కూడా కొనసాగుతోంది. తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 18 లేదా 19 తేదీల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఒంటిపూట బడుల సమయాల్లో మార్పులు చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికారిక నిర్ణయం కోసం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు.

Advertisement

Sudheer Ramanujam

Sudheer Ramanujam Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి