Charminar Express Train : బిగ్ బ్రేకింగ్.. నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్.. 50 మందిపైగా గాయాలు..!
Charminar Express Train : ఇవాళ నాంపల్లి రైల్వే స్టేషన్లో nampally railway station చార్మినార్ ఎక్స్ ప్రెస్ Charminar Express Traind కు ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పి ఫ్లాట్ ఫామ్ సైడ్ వాల్ ను రైలు Train ఢీకొట్టింది accident . ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. మొత్తం మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. నాంపల్లి చివరి స్టేషన్ కావడంతో రైలు డెడ్ ఎండ్ కి వచ్చిన తర్వాతే ఈ ప్రమాదం జరిగిందని సీపీఆర్ఓ రాకేష్ తెలిపారు. డ్రైవర్ సడన్గా బ్రేక్ వేయడంతోనే రైలు పట్టాలు తప్పిందని ఆయన అన్నారు. చాలామంది ప్రయాణికులు సికింద్రాబాద్ లోనే దిగిపోయారు. తక్కువ మంది ప్రయాణికులు నాంపల్లికి వచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఆరుగురు ప్యాసింజర్లకు గాయాలు అయ్యాయి. వారిని లాలాగూడ రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వీలైనంత త్వరగా రైలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. రైలు తొలగించిన అనంతరం పట్టాలు దెబ్బతిన్న విషయం తెలుస్తుంది. ఈ ప్రమాదం వలన నాంపల్లికి వచ్చే కొన్ని రైళ్లను రద్దు చేసే అవకాశం ఉందని సీపీఆర్ఓ రాకేష్ తెలిపారు. రైలు చెన్నై నుంచి హైదరాబాదుకు చేరుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది. స్టేషన్ కు నెమ్మదిగా వస్తుండడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని, కొందరు స్వల్పంగా గాయపడ్డారని దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంపై హైదరాబాద్ జిల్లా ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. పట్టాలు కొద్దిగా పక్కకి జరగడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఆయన అన్నారు.
జిల్లా యంత్రాంగం సహాయ చర్యలు చేపట్టాలని, గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. చెన్నై నుంచి నాంపల్లి కి వస్తున్న రైలుకి చిన్న ప్రమాదం జరిగింది. రైలు నెమ్మదిగా వస్తుండటంతో ఈ ప్రమాదం తప్పింది. అదే వేగంగా రైలు వస్తే పరిస్థితి వేరేలా ఉండేది అని అక్కడి స్థానికులు అంటున్నారు. డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడం వలన మూడు భోగీలు పట్టాలు తప్పాయి. ప్రయాణికులు కూడా తక్కువ మంది ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఆరుగురు ప్రయాణికులకు మాత్రం గాయాలవ్వగా వారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.