Chiranjeevi : హైదరాబాదులోని గోల్కొండ కోట చరిత్ర తెలిసేలా కేంద్ర ప్రభుత్వం సౌండ్ అండ్ లైట్ షోను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక శాఖ మాజీ మంత్రి చిరంజీవి, ఎంపీ, రచయిత విజయేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ జైశ్రీరామ్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అయోధ్యకు వెళ్లడం చాలా ఆనందంగా ఉందని, ఇది తనకు భగవంతుడు కల్పించిన అదృష్టమని పేర్కొన్నారు. గోల్కొండ కోటలో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందన్నారు. గతంలో గోల్కొండలో హీరోయిన్లతో కలిసి డాన్స్ చేసిన సందర్భాలు, అలాగే పోరాట సన్నివేశాలు గుర్తొస్తున్నాయని అన్నారు. రాంచరణ్ తో రాజమౌళి తీసిన మగధీర సినిమాలోని ఒక పాటను ఇక్కడే చిత్రీకరించారని గుర్తు చేసుకున్నారు.
1000 పదాలు చెప్పలేనిది ఓ దృశ్యం చెబుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు చరిత్ర తెలియజేసేలా అత్యాధునిక టెక్నాలజీతో సౌండ్ అండ్ లైట్ సిస్టం ఏర్పాటు చేయడం అభినందనీయమని చిరంజీవి అన్నారు. మన వారసత్వ సంపదను కాపాడుకోవాలని, గతంలో తాను కేంద్ర పర్యాటక మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీని టూరిజంలో నెంబర్ వన్ గా నిలబెట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మన దేశంలో ఉన్న భిన్న వాతావరణ పరిస్థితులు, టూరిజం వసతులు ఎక్కడ ఉండవని తెలిపారు. ఓవైపు ఎడారి మరోవైపు మంచు ఇంకోవైపు అత్యధిక వర్షపాతం లాంటి విభిన్న పరిస్థితులు ఉన్నాయని, ఇది మన భారత్ గొప్పతనం అని కొనియాడారు. అయితే ప్రపంచ టూరిజంలో మనది కేవలం 1.3 శాతం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సంఖ్య మరింత పెరగాలని వరల్డ్ టూరిజం లో ఇండియా మెరుగైన స్థానంలో ఉండాలని తాను ఆశిస్తున్నాను అని అన్నారు. మన జీడిపిలో సింహభాగం టూరిజం నుంచే ఉందని చిరంజీవి వెల్లడించారు. ఇక కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ హయాంలో వారసత్వ సంపదకు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే చారిత్రాత్మక గోల్కొండ కోటలో సరికొత్త టెక్నాలజీతో సౌండ్ అండ్ లైట్ సిస్టం ఏర్పాటు చేశామన్నారు. అలాగే రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు వచ్చిందన్నారు. వరంగల్ వేయి స్తంభాల గుడిని పునర్ నిర్మిస్తున్నామన్నారు. అక్కడ కూడా ఇలాంటి సౌండ్ అండ్ లైట్ షో కోసం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భద్రాచలం, జోగులాంబ అమ్మవారి దేవాలయాల అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించిందన్నారు…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం మరి కొద్ది రోజులలో…
Ind Vs Aus : సొంత గడ్డపై దారుణమైన ఓటమిని తమ ఖాతాలో వేసుకున్న భారత India జట్టు ఇప్పుడు…
Health Benefits : పారిజాత మొక్క శాస్త్రీయంగా Nyctanthes arbor-tristis అని పిలుస్తారు. ఇది సువాసనగల, రాత్రిపూట పుష్పించే చెట్టు.…
Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
This website uses cookies.