CM KCR Resigned : సీఎం ప‌ద‌వికి కేసీఆర్ రాజీనామా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

CM KCR Resigned : సీఎం ప‌ద‌వికి కేసీఆర్ రాజీనామా

CM KCR Resigned : Telangana Elections Results 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు,  తెలంగాణ సీఎం ప‌ద‌వికి కేసీఆర్ రాజీనామా చేశారు. రాజ్ భ‌వ‌న్ కి వెళ్లి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైకి కేసీఆర్ త‌న రాజీనామా ప‌త్రాన్ని అంద‌జేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఛేజిక్కించుకోవ‌డంతో ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి కేసీఆర్ రాజీనామా చేశారు. తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కాంగ్రెస్ ఇప్ప‌టి వ‌ర‌కు 60 స్థానాలు గెలుచుకోగా, మ‌రో 5 స్థానాల్లో లీడ్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :3 December 2023,5:13 pm

ప్రధానాంశాలు:

  •  Telangana Elections Results 2023 : కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఓట‌మి..!

  •  తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు

CM KCR Resigned : Telangana Elections Results 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు,  తెలంగాణ సీఎం ప‌ద‌వికి కేసీఆర్ రాజీనామా చేశారు. రాజ్ భ‌వ‌న్ కి వెళ్లి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైకి కేసీఆర్ త‌న రాజీనామా ప‌త్రాన్ని అంద‌జేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఛేజిక్కించుకోవ‌డంతో ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి కేసీఆర్ రాజీనామా చేశారు. తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కాంగ్రెస్ ఇప్ప‌టి వ‌ర‌కు 60 స్థానాలు గెలుచుకోగా, మ‌రో 5 స్థానాల్లో లీడ్ లో ఉంది.

బీఆర్ఎస్ 31 స్థానాలు గెలిచి 8 స్థానాల్లో లీడ్ లో ఉంది. బీజేపీ 8 స్థానాలు గెలిచింది. ఎంఐఎం 5 స్థానాల్లో గెలిచి 2 స్థానాల్లో లీడ్ లో ఉంది. ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి ఇంత‌కుముందే కేసీఆర్ రాజ్ భ‌వ‌న్ కు చేరుకున్నారు. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైతో భేటీ అయ్యారు. త‌న రాజీనామా ప‌త్రాన్ని గ‌వ‌ర్న‌ర్ కు అంద‌జేశారు.

ఇక‌.. మ్యాజిక్ ఫిగ‌ర్ కు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ డిసెంబ‌ర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసి కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నుంది. అయితే.. కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డే వ‌ర‌కు కేసీఆర్.. ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రిగా కొన‌సాగ‌నున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది