KTR Vs Harish Rao : పార్టీలో పట్టు కోసం కేటీఆర్- హరీశ్ మధ్య కోల్డ్ వార్ ?
KTR Vs Harish Rao : గులాబీ పార్టీలో జరుగుతున్న తాజీ రాజకీయ పరిణామాలు ఆ పార్టీ నేతల మధ్య హాట్ టాపిక్‌గా మారాయి. పార్టీలో పట్టు కోసం కేటీఆర్-హరీశ్ మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఐదు పవర్ సెంటర్లు ఉంటాయన్నది బహిరంగ రహస్యమే. అందులో కేసీఆర్.. కేటీఆర్.. కవిత.. హరీశ్ రావులతో పాటు సంతోష్. మిగిలిన పవర్ సెంటర్ల సంగతి ఎలా ఉన్నా కేటీఆర్-హరీశ్ మధ్యన ఎప్పటినుంచో […]
ప్రధానాంశాలు:
KTR Vs Harish Rao : పార్టీలో పట్టు కోసం కేటీఆర్- హరీశ్ మధ్య కోల్డ్ వార్ ?
KTR Vs Harish Rao : గులాబీ పార్టీలో జరుగుతున్న తాజీ రాజకీయ పరిణామాలు ఆ పార్టీ నేతల మధ్య హాట్ టాపిక్‌గా మారాయి. పార్టీలో పట్టు కోసం కేటీఆర్-హరీశ్ మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఐదు పవర్ సెంటర్లు ఉంటాయన్నది బహిరంగ రహస్యమే. అందులో కేసీఆర్.. కేటీఆర్.. కవిత.. హరీశ్ రావులతో పాటు సంతోష్. మిగిలిన పవర్ సెంటర్ల సంగతి ఎలా ఉన్నా కేటీఆర్-హరీశ్ మధ్యన ఎప్పటినుంచో అధిపత్య పోరు నడుస్తున్నది. తాజాగా ఇది మరింత ఎక్కువైనట్లు సమాచారం.ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న ఒక కీలక పరిణామంలో ఓ ప్రముఖుడి సంస్థకు చెందిన అంశంలో ఇరువురి మధ్య కోల్డ్ వార్ ఎక్కువైనట్లుగా తెలుస్తున్నది.
సదరు సంస్థకు సంబంధించిన వివాదంలో రాజకీయంగా ముందుకు వెళ్లకూడదన్న స్టాండ్ హరీశ్ రావు తీసుకుంటే కేటీఆర్ మాత్రం అలాంటిదేమీ వద్దన్నట్లుగా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ ఇద్దరూ ఎవరికి వారు తమ అభిప్రాయంపై గట్టిగా పట్టుబడుతుండంతో గులాబీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు సమాచారం. మొత్తం ఈ ఎపిసోడ్ లో బీఆర్ఎస్ పార్టీ మీడియా కూడా కేటీఆర్ పక్షాన నిలిచినట్లుగా తెలుస్తోంది. దాంతో హరీశ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. విపక్షంలో ఉన్నప్పుడు పరిమితుల్ని తెలుసుకుని వ్యవహరించాలన్నది హరీశ్ ఆలోచన అయితే.. అలాంటివేమీ ఉండవన్నట్లుగా కేటీఆర్ ఆలోచనగా పేర్కొంటున్నారు. మొత్తంగా వీరిరువురి మధ్య కోల్డ్ వార్ ఎక్కడి వరకు వెళ్తుందన్నది గులాబి శిబిరంలో జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి.
అయితే కేటీఆర్ మాత్రం తమ మీదా, తమ పార్టీ మీదా సోషల్ మీడియాలో దాడులు జరుగుతున్నాయని, అబద్ధాల్ని, అసత్యాల్ని ప్రచారం చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ అంశంలో తమ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే వారికి ఆయన ఎప్పటికప్పుడు వార్నింగ్ లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే తమ విషయంలో ఒకలా.. మిగిలిన వారి విషయంలో మరోలా వ్యవహరించే కేటీఆర్ తీరును పలువురు తప్పు పడుతున్నారు.