Telangana Congress : సీఎం అభ్యర్థిపై అధిష్ఠానం క్లారిటీ? తెలంగాణలో కాంగ్రెస్ నుంచి సీఎం ఎవరో తేల్చేసిన సోనియా?
Telangana Congress : తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలే వినిపిస్తున్నాయి. దానికి కారణం ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడమే. అక్కడ గెలవడంతో ఇక తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపుపై అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అంటే ప్రస్తుతం కాంగ్రెస్ అనే చెప్పుకోవాలి. బీఆర్ఎస్ ను ఓడించి.. తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ తెగ ప్రయత్నాలు చేస్తోంది.
అదంతా పక్కన పెడితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు అనేదానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ఎందుకంటే.. బీఆర్ఎస్ పార్టీలో సీఎం అభ్యర్థి ఎవరు అంటే టక్కున కేసీఆర్ అని చెబుతాం. అదే బీజేపీలో సీఎం అభ్యర్థి ఎవరు అంటే టక్కున కిషన్ రెడ్డి లేదా బండి సంజయ్ అంటాం. కానీ.. కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థి ఎవరు అంటే ఎవరి పేరు చెబుతాం. రేవంత్ రెడ్డినా, ఉత్తమ్ కుమార్ రెడ్డినా, లేక వీహెచ్, భట్టి, కోమటిరెడ్డి.. ఎవరు సీఎం అవుతారు అనేదానిపై క్లారిటీ లేదు.కర్ణాటకలో ఎన్నికలకు వెళ్లడానికి ముందే అక్కడ సీఎం అభ్యర్థి ఎవరో కాంగ్రెస్ ప్రకటించింది. కానీ.. తెలంగాణలో అలాంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే.. తెలంగాణ కాంగ్రెస్ లో చాలామంది సీఎం అభ్యర్థులు ఉన్నారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.
Telangana Congress : ఎన్నికల ముందు సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారా?
ఇప్పుడు ఇతర పార్టీల నుంచి కూడా కీలక నేతలు కాంగ్రెస్ లో చేరుతుండటంతో ఎవరిని సీఎం చేయాలని అధిష్ఠానం తెగ ఆలోచిస్తోంది. ఎందుకంటే.. ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మిగితా వాళ్లు అసంతృప్తికి లోనయి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే ప్రమాదం ఉంది. నిజానికి.. ప్రస్తుతం తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఉన్నా కూడా ఆయనకు అన్ని పవర్స్ లేవు. తెలంగాణ ఎన్నికల ఇన్ చార్జ్ గా కర్ణాటక నేత డీకే శివకుమార్ ఉన్నారు. ఆయనే ఇప్పుడు పార్టీని ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎవరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించినా ఎన్నికలకు ముందే సమస్య వస్తుందని.. అందుకే ఎన్నికలు పూర్తయ్యేదాకా సీఎం అభ్యర్థిని ప్రకటించకూడదని అధిష్ఠానం ఫిక్స్ అయిందట. ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే అప్పుడే సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.