బిగ్ బ్రేకింగ్‌: రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్‌, పార్లమెంట్‌లో అసలేం జరుగుతోంది?

Authored By Himanshi | The Telugu News | Updated on: March 23, 2021, 3:36 pm

revanth reddy : దేశ వ్యాప్తంగా గత నెల రోజులుగా కరోనా మళ్లీ విజృంభిస్తుంది. పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్నాయి. గత ఏడాది తరహాలో మళ్లీ కరోనా కేసులు వేలల్లో నమోదు అవుతున్న నేపథప్యంలో ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి.

ఈ సమయంలోనే కరోనా ప్రముఖ రాజకీయ నాయకులను కూడా వదిలి పెట్టడం లేదు. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర మండలి సభ్యుడు సతీష్‌ కు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది. నేడు కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డి కి కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది. ఆ విషయాన్ని స్వయంగా ట్విట్టర్‌ ద్వారా రేవంత్‌ రెడ్డి వెళ్లడించాడు.

revanth reddy : పార్లమెంట్‌కు వెళ్లిన సమయంలోనే…

Revanth reddy

Revanth reddy

ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో రేవంత్‌ రెడ్డి పార్లమెంటు సమావేశాల కోసం వెళ్లారు. ఇటీవల పార్లమెంట్ లో రేవంత్‌ రెడ్డి దేశ ద్రోహం కేసులపై కేంద్ర ప్రభుత్వంను ప్రశ్నించాడు. ఇంకా పలు చర్చల్లో కూడా రేవంత్‌ రెడ్డి పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో ఆయన కు పార్లమెంటు లోనే కరోనా అంటి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కరోనా పాజిటివ్‌ అంటూ రిపోర్ట్‌ వచ్చిన నేపథ్యంలో గత వారం రోజులుగా తనను కలిసిన వారు.. తాను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా అనుమానం ఉంటే టెస్ట్‌ చేయించుకుని జాగ్రత్తగా ఉండాలంటూ రేవంత్‌ రెడ్డి సూచించాడు. పార్లమెంట్‌ లో మరెంత మందికి కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవుతుందో అనే ఆందోళన వ్యక్తం అవుతుంది.

Himanshi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp