Ponguleti Srinivasa Reddy : బిగ్ బ్రేకింగ్.. స్మగ్లింగ్ కేసులో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమారుడికి నోటీసులు..!
ప్రధానాంశాలు:
Ponguleti Srinivasa Reddy : బిగ్ బ్రేకింగ్.. స్మగ్లింగ్ కేసులో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమారుడికి నోటీసులు..!
Ponguleti Srinivasa Reddy : మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్ష రెడ్డి ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్నారు. స్మగుల్డ్ గూడ్స్ కు సంబంధించిన కేసులో తాజాగా హర్ష రెడ్డికి చెన్నై కష్టమ్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
Ponguleti Srinivasa Reddy లగ్జరీ వాచ్ ఆర్డర్…
పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్షారెడ్డి ఇటీవల పటేల్ ఫిలిప్ ,మరియు బ్రిగేట్ అనే బ్రాండ్ లకి సంబంధించిన రెండు లగ్జరీ వాచ్ లను ఆర్డర్ చేశారు. అయితే ఈ వాచ్ లు భారతదేశంలో దొరకకపోవడంతో ఎలాగైనా వీటిని తెప్పించుకునేందుకు హర్ష రెడ్డి నవీన్ కుమార్ అనే వ్యక్తి సహాయంతో ముబిన్ అనే స్మగ్లర్ ను ఆశ్రయించాడు. దీంతో హర్ష రెడ్డి కోసం ముబిన్ ఎంతో ఖరీదైన ఆ రెండు వాచ్ లను సింగపూర్ నుండి తీసుకువచ్చారు. ఇక ఆ వాచ్ విలువ ఒక్కోటి దాదాపు 1.75 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.
ఇక ఈ వాచ్ ల కోసం హర్ష రెడ్డి హవాలా రూపంలో డబ్బులు చెల్లించినట్లుగా సమాచారం. దీంతో ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న చెన్నై కష్టమ్స్ అధికారులు నవీన్ కుమార్ ను విచారించి , తాజాగా హర్ష రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. అంతేకాక ఏప్రిల్ 4వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. కానీ హర్ష రెడ్డి తన ఒంట్లో బాగాలేదని ఏప్రిల్ 27 తర్వాత విచారణకు హాజరవుతానని అధికారులకు రిప్లై ఇచ్చినట్లు సమాచారం.
Ponguleti Srinivasa Reddy వాచ్ విలువ 100 కోట్లు…
ఇది ఇలా ఉండగా స్మగుల్డ్ గూడ్స్ రూపంలో తీసుకువచ్చిన ఆ రెండు వాచ్ ల మొత్తం విలువ దాదాపు 100 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.