Dil Raju : దిల్ రాజుకి కీల‌క ప‌ద‌వి అప్ప‌గించిన తెలంగాణ ప్ర‌భుత్వం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dil Raju : దిల్ రాజుకి కీల‌క ప‌ద‌వి అప్ప‌గించిన తెలంగాణ ప్ర‌భుత్వం..!

 Authored By ramu | The Telugu News | Updated on :7 December 2024,5:15 pm

ప్రధానాంశాలు:

  •  Dil Raju : దిల్ రాజుకి కీల‌క ప‌ద‌వి అప్ప‌గించిన తెలంగాణ ప్ర‌భుత్వం..!

Dil Raju : డిస్ట్రిబ్యూట‌ర్‌గా కెరీర్ గా మొద‌లు పెట్టిన దిల్ రాజు నిర్మాతగా మంచి పేరు ప్రఖ్యాత‌లు సంపాదించుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దిల్‌ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కల్పించింది. తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఆయనను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యార్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీచేశారు. ఆయన ఈ పదవిలో రెండేండ్ల పాటు కొనసాగనున్నారు. గతంలో దిల్ రాజు కాంగ్రెస్ పార్టీ తరఫున నిజామాబాద్ ఎంపీగా బరిలో దిగేందుకు సన్నాహాలు చేశారు. అయితే రాజకీయ ఈక్వేషన్స్ అనుకూలించకపోవడంతో అది జరగలేదు. కానీ ఇప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకి ఫిల్మ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి అప్పగించడం, సినీ వర్గాలతో పాటు రాజకీయా వర్గాల్లో సైతం ఆసక్తికర చర్చకు దారి తీసింది.

Dil Raju దిల్ రాజుకి కీల‌క ప‌ద‌వి అప్ప‌గించిన తెలంగాణ ప్ర‌భుత్వం

Dil Raju : దిల్ రాజుకి కీల‌క ప‌ద‌వి అప్ప‌గించిన తెలంగాణ ప్ర‌భుత్వం..!

Dil Raju కీల‌క ప‌ద‌వి..

దిల్‌ రాజు అసలు పేరు వెంకటరమణా రెడ్డి. 1990లో పెళ్లి పందిరి సినిమాతో డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ ప్రారంభించారు. అనంతరం దిల్‌ సినిమాతో నిర్మాతగా మారారు. ఆ చిత్రం విజయం సాధించడంతో ఆయన పేరు దిల్‌ రాజుగా మారింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌ సినిమాలే కాకుండా చిన్ని చిత్రాలు కూడా నిర్మిస్తూ అనేకమందికి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తున్నవారిని ప్రోత్సహించేందుకు గాను దిల్‌ రాజు డ్రీమ్స్‌ పేరుతో కొత్త బ్యానర్‌ ప్రారంభిస్తున్నానని ఇటీవలే ప్రకటించారు. దీనికోసం ఒక వెబ్‌సైట్‌ను కూడా లాంచ్‌ చేయనున్నారు.

సినీ పరిశ్రమకు ప్రభుత్వ సంబంధాల వారధిగా చురుకుగా వ్యవహరిస్తూ తనపై ప్రభుత్వం నమ్మకాన్ని పెంచుకున్నారు. ఇప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మారడంతో, ఆయన ప్రభుత్వానికి మరింత దగ్గరగ సినిమా పరిశ్రమను తీసుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దిల్ రాజు తెలంగాణ ముఖ్యమంత్రిను కలవబోతున్నారన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీ కేవలం అభినందనల వరకే పరిమితం అవుతుందా.? లేక సినీ పరిశ్రమకు సంబంధించిన కీలక అంశాలు చర్చించే అవకాశం ఉందా.? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది