Dil Raju : ఎంపీగా ఏ పార్టీలో నుండైనా గెలిచే సత్తా ఉంది.. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

Advertisement

Dil Raju : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. నైజాం డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన దిల్ రాజు అతి తక్కువ కాలంలోనే నిర్మాతగా ఎదిగి.. మంచి సక్సెస్ సినిమాలు నిర్మించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు టాప్ మోస్ట్ హీరోలందరితో దిల్ రాజు సినిమాలు చేయడం జరిగింది.

Advertisement

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్ ఇంకా చాలామంది హీరోలతో సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చరణ్ హీరోగా తెరకెక్కుతున్న “గేమ్ చేంజర్” అనే పాన్ ఇండియా సినిమా మనోడే నిర్మిస్తున్నారు. చరణ్ కెరియర్ లో ఇది 15వ సినిమా కావటంతో పాటు అత్యధిక హై బడ్జెట్ సినిమా. ఇదిలా ఉంటే ఫిలిం ఛాంబర్ ఎన్నికలలో దిల్ రాజు పోటీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తన ప్యానల్ సభ్యులతో కలసి నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నికలలో గెలిస్తే కిరీటాలు పెట్టారని.

Advertisement
dil raju Political comments
dil raju Political comments

కొత్త సమస్యలు వచ్చినట్టేనని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సంక్షేమం కోసమే తాను ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో అసలైన రాజకీయాలలో తాను ఏ పార్టీ నుండి అయినా ఎంపీగా పోటీ చేస్తే గెలిచే సత్తా తనకు ఉందని దిల్ రాజు వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement