KTR : 80 కిడ్స్ కళ్లలో ఆనందం.. కేటీఆర్ తల్చుకుంటే ఏదైన సాధించగలడు అనేందుకు ఇదే నిదర్శణం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KTR : 80 కిడ్స్ కళ్లలో ఆనందం.. కేటీఆర్ తల్చుకుంటే ఏదైన సాధించగలడు అనేందుకు ఇదే నిదర్శణం

 Authored By himanshi | The Telugu News | Updated on :6 March 2021,1:20 pm

KTR : హైదరాబాద్ లో ఒకప్పుడు డబుల్‌ డెక్కర్ బస్సులు ఉండేవి. ఇప్పటికి కొన్ని 1990 సినిమాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ బస్సులను చూసిన సమయంలో ఇప్పుడు కూడా ఉంటే బాగుండేది. అలా హైదరాబాద్‌ రోడ్ల మీద చక్కర్లు కొడుతూ పై నుండి వ్యూ ను ఎంజాయ్‌ చేసే వాళ్లం కదా అనుకుంటున్న వారు చాలా మంది ఉంటారు. బడ్జెట్‌ సమస్య కారనంగా 2000 సంవత్సరం తర్వాత ఆ బస్సులను ఆర్టీసీ వారు రద్దు చేశారు. డబుల్ ఇంజిన్‌ తో పాటు డబుల్ మెయింటెన్స్ అవుతున్న కారణంగా వాటిని అధికారులు కనుమరుగు చేశారు. ఇటీవల హైదరాబాద్‌ కు చెందిన ఒక వ్యక్తి డబుల్‌ డెక్కర్‌ బస్సు ఫొటోలను కేటీఆర్ కు షేర్‌ చేయడంతో ఒక్కసారిగా మంత్రి కేటీఆర్‌ కూడా గతంలోకి వెళ్లి పోయాడు.

Double decker bus to hit Hyderabad roads very soon

Double decker bus to hit Hyderabad roads very soon

KTR : కేటీఆర్‌ ప్రత్యేక శ్రద్ద…

తాను కాలేజ్ లో ఉన్న రోజుల్లో రోడ్ల పై డబుల్‌ డెక్కర్‌ బస్సులు ఉండేవని, వాటిని ఇప్పుడు రోడ్ల మీద ఎందుకు చూడలేక పోతున్నామో తాను తెలుసుకోవాలని ఉందంటూ ఆ ఫొటోలకు స్పందించాడు. కేటీఆర్ అడిగిన కొన్ని రోజుల్లోనే రవాణ శాఖ స్పందించింది. గతంలో ఉన్న ఆ బస్సులను మెయింట్స్‌ ఎక్కువ అవుతున్న కారణంగా తొలగించినట్లుగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ వాటిని తీసుకు వచ్చేందుకు ఎందుకు ప్రయత్నించకూడదు అంటూ కేటీఆర్‌ రవాణ శాఖ అధికారులకు సూచించడంతో గత కొన్ని నెలలుగా ఆ దిశగా చర్చలు జరిగాయి. ఇప్పుడు ఉన్న బడ్జెట్‌ కు రోడ్లకు టికెట్‌ రేట్లకు అనుకూలమైన డబుల్‌ డెక్కర్‌ బస్సు మోడల్ ను తయారు చేయించారు.

KTR : మరి కొన్ని రోజుల్లో బస్సులు రోడ్ల మీదకు…

హైదరాబాద్‌ రోడ్ల మీద మళ్లీ డబుల్‌ డెక్కర్ బస్సులు చూస్తామని ఏ ఒక్కరు కూడా ఊహించలేదు. కాని కేటీఆర్‌ పుణ్యమా అని 80 కిడ్స్ మళ్లీ రోడ్ల మీద తాము గతంలో ఎక్కిన డబుల్‌ డెక్కర్‌ బస్సులను చూడబోతున్నారు. గతంలో ఎక్కి తిరిగిన ఆ బస్సులను మళ్లీ ఇన్నాళ్లకు వారు ఎక్కబోతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే మంత్రి అది కూడ కేటీఆర్ వంటి వ్యక్తి తల్చుకుంటే కాకుండా ఉంటుందా. కేటీఆర్‌ పట్టుదలకు ఇది నిదర్శణంగా చెప్పుకోవచ్చు. ఈమద్య కాలంలో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఫ్లై ఓవర్ బ్రిడ్జీలు అయ్యాయి. కనుక వాటిని ఎలా ఈ డబుల్ డెక్కర్‌ బస్సులు అధిగమిస్తాయి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మొదట ప్రయోగాత్మకంగా కొన్ని బస్సులను తీసుకు వచ్చి ఆ తర్వాత మరిన్ని బస్సులను తీసుకు వస్తారట. ఇప్పటికే బస్సుల కోసం కొటేషన్‌ లను ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది