Drunk And Drive : న్యూ ఇయర్.. భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. ఏన్ని అంటే..!
ప్రధానాంశాలు:
Drunk And Drive : న్యూ ఇయర్.. భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. ఏన్ని అంటే..!
Drunk And Drive : కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ Hyderabad నగరంలో మంగళవారం రాత్రి భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు Drunk and Drive cases నమోదు కాగా,హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,184, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 619 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈస్ట్ జోన్‌లో అత్యధికంగా 270 కేసులు, సౌత్ ఈస్ట్ జోన్‌లో 192, వెస్ట్ జోన్‌లో 179, సౌత్ వెస్ట్ జోన్‌లో 179, నార్త్ జోన్‌లో 177, సౌత్ జోన్‌లో 119, సెంట్రల్ జోన్‌లో 102 కేసులు నమోదు అయ్యాయి.రాచకొండ పోలీసు కమిషనరేట్ Rachakonda Police Commissionerate పరిధిలో ఎల్‌బీనగర్ డివిజన్‌లో అత్యధికంగా 232, మల్కాజ్‌గిరి డివిజన్‌లో 230, భువనగిరి డివిజన్‌లో 84, మహేశ్వరం డివిజన్‌లో 47 కేసులు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు.
Drunk And Drive మందుబాబుల రచ్చ…
మందుబాబులకు మాత్రం పోలీసులు గట్టి షాకే ఇచ్చారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తాగి వాహనాలు నడిపిన వారి పనిపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి మందు సేవించిన వారిని పట్టుకున్నారు. వారిపై కేసులు కూడా నమోదు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. రాత్రి 10 గంటల నుంచి ఈరోజు ఉదయం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు పోలీసులు. మందు సేవించి వాహనం నడిపిన అనేక మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాగి వాహనాలు నడుపుతున్నట్లు అనుమానం వచ్చిన వెంటనే పోలీసులు వారిని ఆపై మరీ బ్రీత్ ఎనలైజర్ టెస్టులు నిర్వహించారు…
రాత్రి మొత్తం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించిన అనేక మంది పోలీసులకు చిక్కారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 619 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. కొందరు పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగారు. మరికొందరు అయితే నానా విన్యాసాలు చేస్తూ హడలెత్తించారు. పంజాగుట్టలో 550 పాయింట్లతో ఓ వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడడం ఆసక్తి రేకెత్తించింది. ఆంక్షలను లెక్కచేయని మందుబాబులపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. కొందరిని జైలుకు పంపారు. అటు హైదరాబాద్ నగరంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విపరీతంగా జరిగాయి. నూతన సంవత్సరం వేళ హైదరాబాద్ నగరంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా నిర్వహించారు.
న్యూ ఇయర్ వేడుకల వేళ పోలీసులు పలు చోట్ల డ్రంక్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు. పలువురైతే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వాహనాలతో విన్యాసాలు చేస్తూ.. యువకులు హల్చల్ చేశారు. pic.twitter.com/40qD3JuZc1
— ChotaNews App (@ChotaNewsApp) January 1, 2025