ఈ సంవత్సరం హైదరాబాద్‌లో ఎన్ని డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయంటే….
గత ఆరు నెలల్లో 9వేల డ్రంకెన్ డ్రైవ్ కేసులు
రోజుకు 50 మంది డ్రంకెన్ డ్రైవ్ చిక్కుతున్న మందుబాబులు
హైదరాబాద్ : లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటినుండి మందుబాబులు తాగి మీళ్లీ రోడ్ల మీదకు వస్తున్నారు. గత సంవత్సరం ఒక్క హైదరాబాద్ కమిషనరేట్‌లో సుమారు 9 వేల కేసులు నమోదు అవ్యగా ఈ సంవత్సరం ప్రతినెలా 1500 కేసలు నమోదు అవుతున్నాయి. అంటే ప్రతిరోజు 50 కేసులు నమోదు అవుతున్నాయని ట్రాఫిక్ గణాంకాలు చెబుతున్నాయి. మే నెలలో లాక్‌డౌన్ ఉన్న కారణంగా 4 కేసులే నమోదయ్యాయి. దీంతో హైదరబాద్ కమిషనరేట్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పై అంతగా దృష్టి సారించక పోవడంతో కేసులు అంతంత్ర మాత్రంగానే నమోదయ్యాయి. ఇక మీదట పూర్తి స్థాయిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రతి రోజూ తనిఖీలు నిర్వహింస్తే మందుబాబులను అదుపు చేయెచ్చని వెల్లడించారు. ఈ ఏడాది అత్యధికంగా ఫిబ్రవరి మాసంలో డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిపై కెసులు నమోదయ్యాయి.
జనవరిలో- 1,200
ఫిబ్రవరిలో- సుమారు 3,300
మార్చిలో- 2,100
ఏప్రిల్‌లో- 1,500
మే నెలలో- 04
జూన్‌లో- 200
జూలైలో ఇప్పటి వరకు 500 పైగా కేసులు నమోదయ్యాయి
Drunk and drive cases in 2021, Drunk and drive , Drunk and drive in telangana , Drunk and drive in hyderabad , డ్రంకెన్ డ్రైవ్ కేసులు