Raithu Barosa: తెలంగాణ రైతులు..రైతు భరోసా విషయంలో మార్గదర్శకాలు ఇవే…!
ప్రధానాంశాలు:
Raithu Barosa: తెలంగాణ రైతులు..రైతు భరోసా విషయంలో మార్గదర్శకాలు ఇవే...!
Raithu Barosa : సంక్రాంతి పండుగ Sankranti వేళ తెలంగాణ సర్కార్ రైతులకు సంబంధించి ఏదైన తిపి కబురు అందుతుందా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ క్రమంలో రైతు భరోసాకు Raithu Barosa సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.12వేలు పెంచినట్లు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుభరోసా పథకం కింద పంట పెట్టుబడి సహాయాన్ని సంవత్సరానికి ఎకరాకు రూ.12వేలు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.
Raithu Barosa ఇవే మార్గదర్శకాలు..
భూభారతి (ధరణి) పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతుభరోసా సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతుభరోసా నుంచి తొలగించింది. ROFR పట్టాదారులు కూడా రైతుభరోసాకు అర్హులు అని ప్రకటించింది. RBI నిర్వహించే DBT పద్ధతిలో రైతుభరోసా సహాయం రైతుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయం తీసుకుంది రైతుభరోసా పథకం వ్యవసాయశాఖ సంచాలకులు ద్వారా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనుంది. NIC, IT భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపింది.
రైతు భరోసా పథకాన్ని వ్యవసాయ శాఖ సంచాలకులు అమలు చేస్తారని, ఐటీ భాగస్వామిగా నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్ వ్యవహరిస్తుందని ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొంది. జిల్లాల్లో రైతు భరోసా పథకం అమలు, ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు Collectors బాధ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో తెలిపింది. రైతు భరోసా పథకం కింద ఎకరాకు సంవత్సరానికి రూ. 12000 పంట పెట్టుబడి సాయం అందించనున్నారు. వ్యవసాయ యోగ్యం కాని భూములకు రైతు భరోసా నుంచి తొలగించాలి. ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసాకు అర్హులవుతారు. ఆర్బీఐ నిర్వహించే డీబీటీ (నగదు బదిలీ) పద్ధతిలో రైతు భరోసా సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. రైతు భరోసా పథకాన్ని వ్యవసాయశాఖ సంచాలకులు అమలు చేస్తారు.ఎన్ఐసీ, హైదరాబాద్ వారు ఐటీ భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తారు.