Electricity Bills : గుడ్ న్యూస్‌.. మ‌ళ్లీ కరెంట్ బిల్లులు ఇక పై యూపీఐ పేమెంట్.. కుదిరిన ఒప్పందం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Electricity Bills : గుడ్ న్యూస్‌.. మ‌ళ్లీ కరెంట్ బిల్లులు ఇక పై యూపీఐ పేమెంట్.. కుదిరిన ఒప్పందం..!

 Authored By ramu | The Telugu News | Updated on :16 August 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Electricity Bills : గుడ్ న్యూస్‌.. మ‌ళ్లీ కరెంట్ బిల్లులు ఇక పై యూపీఐ పేమెంట్.. కుదిరిన ఒప్పందం..!

Electricity Bills : ఈమధ్య ప్రతి ఒక్కటి యూపీఐ పేమెంట్స్ అవ్వడం వల్ల అందరు వాటి ద్వారానే అన్ని పేమెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎలెక్ట్ర్సిటీ బిల్లులను ఎక్కువగా ఆన్ లైన్ లోనే పే చేస్తున్నారు. కరెంట్ ఆఫీఎస్ కు వెళ్లి కరెట్ బిల్లు పే చేసే వారి సంఖ్య చాలా తగ్గింది. ముఖ్యంగా కరోనా టైం లో ఆన్ లైన్ ద్వారానే కరెంట్ బిల్లులు చెల్లించారు. ఐతే ఈమధ్య కరెంట్ బిల్లులను యూపీఐ పేమెంట్స్ ద్వారా చేయడాన్ని రద్దు చేసింది.

తెలంగాణాలో రెండు నెలలుగా కరెంట్ బిల్లులు ఆన్ లైన్ చేయడానికి వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. యూపీఐ ద్వారా చేద్దామని అనుకుంటే ఆ చెల్లింపులు నిరాకరిస్తుంది. మొన్నటిదాకా గూగుల్ పే, పేటీఎం, అమేజాన్ పే, ఫోన్ పే ద్వారా కరెంట్ బిల్స్ పేమెంట్ చేశారు. యూఈఐ సంస్థలతో చేసుకున్న ఒప్పందం కాల పరిమితి ముగియడం వల్ల విద్యుత్ సంస్థలు యూపీఐ పేమెంట్స్ తో బిల్లులు తీసుకోవడం ఆపేశారు. రెండు నెలలుగా వినియోగదారులు ఇబ్బంది పడుతూ యూపీఐ ద్వారా కరెంట్ బిల్స్ పే చేయలేకపోతున్నారు.

Electricity Bills వెబ్ సైట్ ద్వారా బిల్ పేమెంట్స్..

యూపీఐ ద్వారా కరెంట్ బిల్స్ పేమెంట్ నిలిపేసిన టీ.ఎస్.ఎన్.పీ.డీ.సీ.ఎల్ వెబ్ సైట్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా కరెంట్ బిల్స్ పే చేసే అవకాశం ఇచ్చింది. అయితే వీటిపై చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల పేమెంట్స్ ఆగిపోతున్నాయి. యూపీఐ పేమెంట్స్ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యాప్స్ ద్వారా మాత్రం బిల్లులు పే చేసే అవకాశం లేకుండా పోయింది. ఐతే నెలకోసారి బిల్ పే చేసేందుకు మరో కొత్త యాప్ డౌన్ లోన్ చేయడం అంతగా ఆసక్తి చూపించలేదు.

Electricity Bills గుడ్ న్యూస్‌ మ‌ళ్లీ కరెంట్ బిల్లులు ఇక పై యూపీఐ పేమెంట్ కుదిరిన ఒప్పందం

Electricity Bills : గుడ్ న్యూస్‌.. మ‌ళ్లీ కరెంట్ బిల్లులు ఇక పై యూపీఐ పేమెంట్.. కుదిరిన ఒప్పందం..!

ఐతే వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కరెంట్ బిల్స్ ను మళ్లీ యాప్స్ ద్వారానే చెప్పించేలా టీ.ఎస్.ఎన్.పీ.డీ.సీ.ఎల్ ప్రయత్నిస్తుంది. ఏరియాను బట్టి కొన్ని జిల్లాల్లో ఫోన్ పే, భీం యాప్ ల ద్వారా కరెంట్ బిల్స్ పే చేసే అవకాశం కల్పించారు. భారత్ బిల్ పేమెంట్ సిస్టెం సర్వీస్ తో ఒప్పందం జరిగిందని ఎస్.ఈ గంగాధర్ వెల్లడించారు. వారం లో గూగుల్ పే ద్వారా కూడా కరెంట్ బిల్ పే చేసే అవకాశం కల్పిస్తామని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు ఉపయోగించుకోవాలని చెప్పారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది