Etela Rajender : నా నియోజకవర్గంలో నాకు వాళ్ళు పోటీన… రేవంత్ రెడ్డి కూడా ఏం పీకలేడు… ఈటెల రాజేంద్రప్రసాద్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Etela Rajender : నా నియోజకవర్గంలో నాకు వాళ్ళు పోటీన… రేవంత్ రెడ్డి కూడా ఏం పీకలేడు… ఈటెల రాజేంద్రప్రసాద్..!

 Authored By ramu | The Telugu News | Updated on :10 May 2024,6:15 pm

ప్రధానాంశాలు:

  •  Etela Rajender : నా నియోజకవర్గంలో నాకు వాళ్ళు పోటీన... రేవంత్ రెడ్డి కూడా ఏం పీకలేడు... ఈటెల రాజేంద్రప్రసాద్..!

Etela Rajender : మరో 4 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో భాగంగా రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారాలు కొనసాగిస్తూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ మరియు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి ఉండడంతో పొలిటికల్ హిట్ బాగా కనిపిస్తుంది. ఇక తెలంగాణ విషయానికొస్తే ప్రస్తుతం ఇక్కడ లోక్ సభ ఎన్నికలు మాత్రమే జరగనున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజకీయ నేతలు వారి పార్టీ తరపున పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ వస్తున్నారు. దీంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య గట్టి పోటీ నడుస్తుంది. ఈ క్రమంలోనే పార్టీ నేతలు పలు రకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఇక ఈ పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున సునీత మహేందర్ రెడ్డి గారు , బీఆర్ఎస్ నుండి లక్ష్మారెడ్డి గారు , బీజేపీ నుండి ఈటెల రాజేంద్రప్రసాద్ గారు పోటీ చేస్తునారు.

ఈ నేపథ్యంలోనే మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రచారాలు కూడా జోరుగా సాగుతున్నాయి.ఇలాంటి తరుణంలో తాజాగా ఈటెల రాజేంద్రప్రసాద్ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో పలు ఆసక్తికరమైన విషయాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఎవరికి అంత ఆదరణ లేదని తెలియజేశారు. అయితే ఇప్పుడు జరగబోయే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి దేశంలో మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఇక మల్కాజ్ గిరి నియోజకవర్గానికి నేను అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి అంతేకాక నాకు 22 ఏళ్ల అనుభవం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా నన్నే కోరుకుంటున్నారని ఈ సందర్భంగా తెలిపారు.

Etela Rajender నా నియోజకవర్గంలో నాకు వాళ్ళు పోటీన రేవంత్ రెడ్డి కూడా ఏం పీకలేడు ఈటెల రాజేంద్రప్రసాద్

Etela Rajender : నా నియోజకవర్గంలో నాకు వాళ్ళు పోటీన… రేవంత్ రెడ్డి కూడా ఏం పీకలేడు… ఈటెల రాజేంద్రప్రసాద్..!

Etela Rajender : రేవంత్ రెడ్డి ఏం చేయలేదు…

అంతేకాక దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఉంటారు కాబట్టి మల్కాజ్ గిరిలో అభివృద్ధి జరగాలంటే రాజేంద్ర ప్రసాద్ ఉండాలని ప్రజలు భావిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి మరియు బీఆర్ఎస్ అభ్యర్థులు నాకు పోటీ కాదని గత 22 ఏళ్లుగా నేను చేస్తున్న సర్వీసు నా పట్ల ప్రజలకు ఉన్న భావన లెక్కలోకి వస్తాయని తెలిపారు. మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఎక్కడ ప్రజలకు అవసరం ఉన్నా సరే , వారి యొక్క హక్కులకు ఆటంకం కలిగిన , ఎక్కడ అన్యాయం జరిగిన ఆ అన్యాయానికి గొంతుకై మాట్లాడే వారి బిడ్డను నేను అంటూ ఈ సందర్భంగా ఈటల రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ నేపథంలోనే రానున్న ఎన్నికల్లో 100% ప్రజల మద్దతు తనకి దొరుకుతుందని తెలిపారు.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి