BJP Telangana Candidates : తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్టు వచ్చేసింది.. అసెంబ్లీ బరిలో నిలిచే వారెవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

BJP Telangana Candidates : తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్టు వచ్చేసింది.. అసెంబ్లీ బరిలో నిలిచే వారెవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

 Authored By kranthi | The Telugu News | Updated on :3 August 2023,9:00 pm

BJP Telangana Candidates : తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది బీజేపీ. అవును.. తెలంగాణలో బీజేపీ అధికారం కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి సౌత్ ఇండియాలో బీజేపీ పవర్ కు దూరంగానే ఉంది. ఉన్న ఒక్క కర్ణాటక కూడా మొన్న దూరమైంది. దీంతో దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారానికి దూరం అయింది. దీంతో బీజేపీకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణను టార్గెట్ చేసుకుంది. ఈసారి ఎన్నికల్లో సత్తా చాటి తెలంగాణలో గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది.

అందుకే.. తెలంగాణలో నాయకత్వంలో పలు మార్పులు చేపట్టింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ని పక్కన పెట్టి కిషన్ రెడ్డికి ఆ పదవిని అప్పగించింది హైకమాండ్. బండి సంజయ్ కి వేరే బాధ్యతలు అప్పగించింది. ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా నేతలు బీజేపీలోకి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది నేతలు బీజేపీలో చేరారు. క్యాడర్ ను పెంచుకోవడం కోసం అన్ని రకాల ప్రయత్నాలను బీజేపీ చేస్తోంది.ఎన్నికలకు ఇంకా మూడు నాలుగు నెలలే సమయం ఉండటంతో ఇప్పటి నుంచే బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న 119 స్థానాల్లో దాదాపు 75 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ముందుకెళ్తోంది. అందుకే.. ఆ 75 స్థానాల్లో ముఖ్య నేతలను బరిలో దింపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్కెచ్ వేశారట. అలాగే.. బీజేపీ నుంచి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వీళ్లే అంటూ సోషల్ మీడియాలో ఓ లిస్టు హల్ చల్ చేస్తోంది.

first list of bjp candidates released for telangana assembly elections

first list of bjp candidates released for telangana assembly elections

BJP Telangana Candidates : అభ్యర్థుల జాబితాపై కసరత్తు

అందులో ఉన్న వారి పేర్లు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. కొందరు ఎంపీ అభ్యర్థులను ఎమ్మెల్యే లిస్టులో పెట్టినట్టు తెలుస్తోంది. కొందరు ఎంపీలు కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టులో ఉన్నారు. కొందరి పేర్లు కూడా గల్లంతు అయ్యాయట. ఇక.. ఈసారి హుజూరాబాద్ నుంచి కాకుండా ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. అది నిజమా.. అబద్ధమా అనేది తెలియదు. అసలు.. అది అఫిషియల్ లిస్టేనా లేక కావాలని ఎవరైనా తయారు చేశారా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

కిషన్ రెడ్డి – అంబర్ పేట్

కే. లక్ష్మణ్ – ముషీరాబాద్

బండి సంజయ్ – కరీంనగర్

సోయం బాపూరావు – బోధ్

ధర్మపురి అరవింద్ – ఆర్మూర్

ఈటెల రాజేందర్ – గజ్వేల్

రఘునందన్ రావు – దుబ్బాక

డీకే అరుణ – గద్వాల

జితేందర్ రెడ్డి – మహబూబ్ నగర్ లేక నారాయణ్ పేట్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి – మునుగోడు

మురళీధర్ రావు – వేములవాడ లేదా కూకట్ పల్లి

ఎన్. ఇంద్రసేనా రెడ్డి – ఎల్బీ నగర్

వివేక్ – చెన్నూరు

విజయశాంతి – మెదక్

యెండల లక్ష్మి నారాయణ – నిజామాబాద్ అర్బన్

రామచంద్ర రావు – మల్కాజ్ గిరి

ఎన్వీఎస్ఎస్ ప్రసాద్ – ఉప్పల్

ఆచారి – కల్వకుర్తి

జయసుధ – సికింద్రాబాద్

మహేశ్వర్ రెడ్డి – నిర్మల్

రాథోడ్ రమేష్ – ఆసిఫాబాద్

పొంగులేటి సుధాకర్ రెడ్డి – ఖమ్మం

బాబు మోహన్ – ఆందోల్

నందీశ్వర్ గౌడ్ – పటాన్ చెరు

కూన శ్రీశైలం గౌడ్ – కుత్బుల్లాపూర్

బూర నర్సయ్య గౌడ్ – భువనగిరి లేదా ఇబ్రహీంపట్నం

విశ్వేశ్వర్ రెడ్డి – తాండూర్

గరికపాటి మోహనరావు – వరంగల్

ఈటల జమున – హుజురాబాద్

విక్రమ్ గౌడ్ – గోషామహల్

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది