Chityala : చిట్యాల మార్కెట్ యార్డు అభివృద్ధికి శంకుస్థాపన

Authored By Sudheer Ramanujam | The Telugu News | Updated on : 9 April 2026, 2:00 pm
  •  Chityala : చిట్యాల మార్కెట్ యార్డు అభివృద్ధికి శంకుస్థాపన

Chityala : చిట్యాల పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డులో రూ.1.65 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నూతన నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం స్థానిక ప్రజలు, రైతులు, నాయకుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. చిట్యాల మార్కెట్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మార్కెట్ కార్యాలయం నిర్మాణానికి రూ.1 కోటి, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.65 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు. ఈ పనులు పూర్తయితే మార్కెట్ యార్డు సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని రైతులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.

Foundation stone laid for development of Chityala Market Yard

Foundation stone laid for development of Chityala Market Yard

అదేవిధంగా ఇప్పటి వరకు చిట్యాల మండలంలోని 11 గ్రామాలు చౌటుప్పల్ మార్కెట్ పరిధిలో ఉండేవని, ఇకపై ఆ గ్రామాలను చిట్యాల మార్కెట్ పరిధిలోకి విలీనం చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు తెలిపారు. దీంతో స్థానిక రైతులకు రవాణా ఖర్చులు తగ్గి, మార్కెట్ సేవలు సులభంగా అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇంకా చిట్యాల మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించినట్లు చెప్పారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డైయిరీ చెర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ నర్రా వినోద-మోహన్ రెడ్డి, స్థానిక మున్సిపల్ చైర్మన్ పందిరి గీత-రమేష్, కౌన్సిలర్లు, మార్కెట్ డైరెక్టర్ లు నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Sudheer Ramanujam

Sudheer Ramanujam Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి