Nalgonda : పచ్చని పంటలను నాశనం చేస్తున్న మసి.. ఆందోళన చెందుతున్న రైతులు
Nalgonda : వ్యవసాయం అంటే అంత ఈజీ కాదు. ఎంతో కష్టపడితే కానీ పంట చేతికి రాదు. పంట చేతికి వచ్చేదాకా.. బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే. అయితే.. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలంలోని పిట్టంపల్లి రైతులు అయితే.. అక్కడ వ్యవసాయం చేయాలంటేనే హడలిపోతున్నారు. దానికి కారణం.. అక్కడ ఉన్న ఎంపీఎల్ స్టీల్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ.

rice crops and other crops contaminated with mpl steel dust in nalgonda dist
ఆ కంపెనీ నుంచి వస్తున్న కాలుష్యం వల్ల.. అక్కడ ప్రాంతాలన్నీ డస్ట్ తో నిండిపోతున్నాయి. తద్వారా.. అక్కడ ఉన్న పచ్చని పొలాలు, ఇతర పంటలన్నీ నాశనం అవుతున్నాయి. సమీపంలో ఉన్న ఇండ్లు కూడా మసితో కమ్ముకుపోతున్నాయి. ఇది ఇఫ్పటి సమస్య కాదు.. దశాబ్దాల నుంచి ఉన్న సమస్యే. కంపెనీకి చాలాసార్లు రైతులు, ఆ గ్రామస్తులు ఫిర్యాదులు చేసినా కూడా యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదు.
నిజానికి.. కంపెనీలో వస్తువులను తయారు చేసేటప్పుడు కేవలం డస్ట్ ను మాత్రమే బయటికి వదలాల్సి ఉంటుంది. కానీ.. కంపెనీ.. డస్ట్ తో పాటు.. మసిని కూడా విడుదల చేస్తుంది. ఆ మసి.. పొగ రూపంలో ఉంటుంది. అది చాలా డేంజర్. పరిసర ప్రాంతాలను నాశనం చేసే కాలుష్యం అది. దీంతో పంటలు కూడా నాశనం అవుతున్నాయి. పంట చేతికి రావడం లేదు. చివరకు మూగ జీవాలు కూడా ఆ మసి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. రోడ్లు, చెట్లు అన్నీ మసితో నల్లగా మారిపోతున్నారు. అక్కడి నుంచి ప్రయాణం చేయాలంటేనే అక్కడి స్థానికులు దడుసుకుంటున్నారు. చివరకు అధికారులు అయినా పట్టించుకొని ఆ సమస్యను పరిష్కరించాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు.