Gangula Kamalakar : కవిత కొత్త పార్టీ పెడితే ఆ పార్టీకి ఎంత వాల్యూ ఉంటుందో చూద్దాం గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు..!
ప్రధానాంశాలు:
Gangula Kamalakar : కవిత కొత్త పార్టీ పెడితే ఆ పార్టీకి ఎంత వాల్యూ ఉంటుందో చూద్దాం గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు..!
Gangula Kamalakar : కవిత లేఖపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత పార్టీకి సంబంధించిన అంశంపై రాజకీయ వర్గాల్లో వచ్చిన ఊహాగానాలపై ఆయన స్పందించారు. కేసీఆర్ కుమార్తెగా కవిత కొత్త పార్టీ పెడితే ఆ పార్టీకి ఎంత వాల్యూ ఉంటుందో చూడాల్సిందేనని వ్యాఖ్యానించారు. అయితే ఇది కేవలం ఊహాగానమేనని స్పష్టం చేశారు. పార్టీ అంతర్గత విషయాలను బహిరంగంగా మాట్లాడటం సరికాదని, అందుకే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని తెలిపారు.

Gangula Kamalakar : కవిత కొత్త పార్టీ పెడితే ఆ పార్టీకి ఎంత వాల్యూ ఉంటుందో చూద్దాం గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు..!
Gangula Kamalakar : కవిత లేఖపై గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు
“మేమంతా కేసీఆర్ నాయకత్వాన్ని విశ్వసించే కార్యకర్తలం. ఆయనే మన మార్గదర్శి. ఆయన చెప్పిన దానికే నడిచే వాళ్లం” అంటూ స్పష్టం చేశారు. పార్టీ లోపలి విషయాలను చర్చించాల్సింది పార్టీ వేదికలపై మాత్రమేనని, బహిరంగంగా మాట్లాడడం పార్టీకి మంచిది కాదని అన్నారు. కవిత లేఖ లీక్ అయిన విషయాన్ని మాత్రం ఆయన ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా, ఆ అంశంపై ప్రజల ముందు చర్చ అవసరం లేదన్న నడవడిని ప్రదర్శించారు.
కవిత పార్టీ పెట్టే అవకాశం ఉందని జరుగుతున్న ప్రచారం, ఆమె కేసీఆర్‌కు లేఖ రాసిన దానిపై పలు రాజకీయ అర్థాలు వెలువడుతున్న నేపథ్యంలో గంగుల కమలాకర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నప్పటికీ, పార్టీ నేతలు తెరపై ఏకతాటిపై ఉన్నట్టు చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక కవిత లేఖపై ఇంకా ఎంతమంది నేతలు స్పందిస్తారు? ఆమె తీసుకోబోయే తదుపరి నిర్ణయం ఏమవుతుంది? అన్నది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.