GHMC Property Tax : నగర వాసులకి బంపర్ ఆఫర్ ఇచ్చిన జీహెచ్ఎంసీ.. ఆస్తి పన్నులో ఏకంగా 90 శాతం డిస్కౌంట్..!
GHMC Property Tax : హైదరాబాద్ Hyderabad నగరవాసులకు జీహెచ్ఎంసీ GHMC బంపరాఫర్ అందిస్తుంది. ప్రాపర్టీ ట్యాక్స్ GHMC Property Tax బకాయిల వసూళ్ల కోసం మరోసారి వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్ OTS తీసుకువచ్చింది. ఆస్తి పన్నులు బకాయిలు భారీగా ఉండడంతో Property Tax ఆస్తి పన్ను వసూళ్ల విషయంలో జీహెచ్ఎంసీ GHMC కసరత్తులు చేస్తుంది. ఇందుకు గాను ప్రాపర్టీ ట్యాక్స్ వడ్డీపై 90 శాతం డిస్కౌంట్‌తో మరోసారి ఓటీఎస్ అమలు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు రూ.1416 కోట్లు మాత్రమే చేరుకోగా, ఇంకా ఐదు లక్షల మంది చెల్లించాల్సి ఉంది వచ్చే నెలలో ఆర్ధిక సంవత్సరం ముగియనుండడంతో ఇప్పుడు పన్ను వసూళ్లు చేసేందుకు జీహెచ్ఎంసీ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది.
GHMC Property Tax : నగర వాసులకి బంపర్ ఆఫర్ ఇచ్చిన జీహెచ్ఎంసీ.. ఆస్తి పన్నులో ఏకంగా 90 శాతం డిస్కౌంట్..!
అయితే గ్రేటర్ హైదరాబాద్ Greater Hyderabad పరిధిలో మెుత్తం ఆస్తి పన్ను బకాయిలు దాదాపు రూ.4 వేల వేల కోట్ల వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన పన్నులు రూ.3 వేల కోట్లు ఉన్నాయి. మిగిలిన రూ. 1000 కోట్లు గ్రేటర్లోని సుమారు 2 లక్షల మంది నుంచి జీహెచ్‌ఎంసీకి రావాల్సి ఉంది. ఈ పెండింగ్ బకాయిలకు వడ్డీ కలిపితే.. రూ.2,500 కోట్ల వరకు అవుతోంది. ఓటీఎస్ స్కీమ్ OTS Scheme ద్వారా 90 శాతం వడ్డీ డిస్కౌంట్ ఇస్తే రూ.1,150 కోట్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నెలాఖరులోగా ఓటీఎస్‌కి సంబంధించి అధికారికంగా ఓటీఎస్ అమలుకి గ్రీన్ సిగ్నల్ రానుందని అంటున్నారు.
ఇక తొలిసారిగా 2020లో ఓటీఎస్‌ను అమలు చేశారు. 2020 ఆగస్టు1 నుంచి నవంబర్ 15 వరకు ఈ స్కీమ్ అమలు చేశారు. రెండోసారి 2022 జులైలో అమలు చేశారు. ఈ రెండు సార్లు కలిపి బల్దియాకు రూ.700 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. 2024 మార్చిలో మూడోసారి ఓటీఎస్ అమలు చేసి రూ.320 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ Greater Hyderabad అభివృద్ధికి నిధుల సమస్య వేధిస్తుండడంతో మరోసారి ఓటీఎస్ తీసుకురావాలని అధికారులు ఆలోచన చేస్తున్నారు. 2024లో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుండా పెండింగ్ పెట్టిన వారికి ఓటీఎస్ కింద డిస్కౌంట్ ఇచ్చి కనీసం రూ.500 కోట్లు వసూలు చేయాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. ఆస్తి పన్ను వసూళ్లలో గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ సారి అధిక ఆదాయం వచ్చే ఛాన్స్ ఉందని జీహెచ్‌ఎంసీ అధికారులు అంచనా వేస్తున్నారు.
Uric Acid : సాధారణంగా యూరిక్, యాసిడ్ రక్తంలో కరిగి బయటకు వస్తుంది. కానీ, దీని పరిమాణం పెరిగినప్పుడు అది…
Dragon Fruit : ప్రస్తుత కాలంలో వ్యాధుల బారినపడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. చాలామంది విష జ్వరాలు వచ్చినప్పుడు…
Viral Video : సాధారణంగా మనం పాముని చూస్తే ఆమడ దూరం వెళతాం. చిన్న పిల్లలు అయితే ఉలిక్కిపడతారు. కాని…
Shower Peeing : చాలామందికి ఇలాంటి అలవాటు ఉంటుంది. స్నానం చేసే సమయంలో మూత్ర విసర్జన చేస్తుంటారు.ఇలాంటీ అలవాటుని పవర్…
73 Years Old Woman : 73 ఏళ్ల మహిళ కడుపులో 30 ఏళ్లుగా ఉన్న కల్సిఫైడ్ ఫీటస్‌ను(రాతి బిడ్డ)…
Eat Soaked Dates : ఆధార్నంగా పరగడుపున కొన్ని పదార్థాలు తింటే ఆరోగ్యానికి ప్రయోజనాలు కలుగుతాయి. పదార్థాలలో ఒకటైనది డైట్.…
Toli Ekadashi 2025 : ప్రతి సంవత్సరం కూడా తొలి ఏకాదశి వస్తుంది. ఈ ఏడాది కూడా తొలి ఏకాదశి…
Keerthy Suresh : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…
This website uses cookies.