Good News : డ్వాక్రా మహిళలకు శుభవార్త .. త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు !
ప్రధానాంశాలు:
Good News డ్వాక్రా మహిళలకు శుభవార్త .. త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు !
Good News : సీఎం రేవంత్ రెడ్డి Revanth Reddy సర్కార్ రాష్ట్ర డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పింది. అభయహస్తం పథకంలో భాగంగా మహిళలకు తీపి కబురు అందించింది. 2009లో ఈ పథకం ప్రారంభమవ్వగా దీని కింద డ్వాక్రా మహిళలు రోజుకు రూ.1 చొప్పున ఆరేళ్ల పాటు చెల్లించారు. ఈ నిధులు వడ్డీతో కలిపి 2022 నాటికి రూ.545 కోట్లకు చేరుకున్నాయి. ఇప్పుడు ఈ నిధులలో రూ.385 కోట్లను మహిళలకు తిరిగి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.
Good News త్వరలోనే మహిళా ఖాతాల్లో ఈ డబ్బులు జమ
త్వరలోనే మహిళా సంఘాల్లోని సభ్యుల ఖాతాల్లో ఈ డబ్బులను జమ చేసేందుకు సర్కారు అధికారిక ప్రకటన చేయనుంది. ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు సబ్సిడీపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన చేశారు.
వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్ల టెండర్ల ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు. టెండర్లు పూర్తయ్యే సమయానికి భూసేకరణ, బ్యాంకు ఆర్థిక సహాయం వంటి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దేవాదాయ, నీటిపారుదల శాఖల పరిధిలో ఉన్న భూములను సోలార్ ప్లాంట్ల కోసం గుర్తించాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.