Good News For Farmers : రైతులకు శుభవార్త… ఖాతాలోకి రూ. 10,335 కోట్లు జమ చేసిన ప్రభుత్వం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Good News For Farmers : రైతులకు శుభవార్త… ఖాతాలోకి రూ. 10,335 కోట్లు జమ చేసిన ప్రభుత్వం…!

Good News For Farmers : తెలంగాణకు సంబంధించిన రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా దాన్యం అనేది కొనుగోలు చేస్తున్నట్టుగా తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 47.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొని రైతుల ఖాతాల్లో రూ.10,355 కోట్లు జమ చేస్తున్నట్టుగా తెలిపింది. రైతు సంక్షేమం కోసమే తన ప్రభుత్వం పాటుపడుతుంది అని రేవంత్ రెడ్డి సర్కార్ మరొకసారి స్పష్టంగా తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా యాసంగి సీజన్ లో 7.178 ధాన్యం కొనుగోలు చేసే కేంద్రాలను […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 June 2024,9:00 am

Good News For Farmers : తెలంగాణకు సంబంధించిన రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా దాన్యం అనేది కొనుగోలు చేస్తున్నట్టుగా తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 47.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొని రైతుల ఖాతాల్లో రూ.10,355 కోట్లు జమ చేస్తున్నట్టుగా తెలిపింది. రైతు సంక్షేమం కోసమే తన ప్రభుత్వం పాటుపడుతుంది అని రేవంత్ రెడ్డి సర్కార్ మరొకసారి స్పష్టంగా తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా యాసంగి సీజన్ లో 7.178 ధాన్యం కొనుగోలు చేసే కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా.6,345 కేంద్రాల ద్వారా 47.07 లక్షల మెట్రి క్ టన్నుల ధాన్యాన్ని కొన్నట్లుగా స్పష్టం చేసింది. ధాన్యం విక్రయించిన 8,35,109 మంది రైతులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలో రూ.10,355.18 కోట్లు జమ చేస్తున్నట్లు స్పష్టంగా తెలిపింది. వడ్లు అమ్మిన మూడు రోజులలోనే డబ్బు అనేది రైతుల ఖాతాలో జమ చేసినట్లుగా తెలిపింది…

ఈసారి ధాన్యం సేకరణలో నిజామాబాద్, సిద్దిపేట, పెద్దపల్లి, సూర్యపేట,సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి,జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, నల్గొండ, మెదక్, సంగారెడ్డి, జనగామ, మంచిర్యాల జిల్లాలు ముందు వరసలో ఉన్నాయి అని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏప్రిల్ నెలలో కొనుగోలు చేసే కేంద్రాలు మొదలయ్యేవి అని, ఈసారి కి మాత్రం దాదాపుగా రెండు వారాలకు ముందే అనగా మార్చి 25 నుండి కొనుగోలు చేసే కేంద్రాలు మొదలుపెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా 47.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అనేది కొనుగోలు జరిగాయి అన్నారు. రాష్ట్రంలో ఎన్నో చోట్ల సేకరణ ప్రక్రియ అనేది పూర్తి అయ్యిందని చెప్పారు. మరో పది రోజుల పాటు కేంద్రాలకు దాన్యం అనేది వచ్చే అవకాశం ఉంది అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అంచనా వేసింది.

Good News For Farmers రైతులకు శుభవార్త ఖాతాలోకి రూ 10335 కోట్లు జమ చేసిన ప్రభుత్వం

Good News For Farmers : రైతులకు శుభవార్త… ఖాతాలోకి రూ. 10,335 కోట్లు జమ చేసిన ప్రభుత్వం…!

పంటలను ఆలస్యంగా వేసిన రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నెలాఖరు వరకు అవసరం అయినచోట దాన్యం కొనుగోలు చేసే కేంద్రాలు తెరిచి ఉంచాలి అని ఇప్పటికే ఆదేశాలను జారీ చేయడం జరిగిందని తెలిపారు. యాసంగి సీజన్ లో దాదాపు 75.40 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు జరుగుతాయి అని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మార్కెట్లో మద్దతు ధర కంటే అధిక సొమ్ము రావటంతో, ప్రైవేట్ వ్యాపారులు పోటీ పడి మంచి ధరకు దాన్యం కొనటం వలన అంచనా వేసిన విధంగా ధాన్యం రాలేదు అని ప్రభుత్వం స్పష్టం చేసినది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది