Rythu Bandhu : రైతన్నలకు శుభవార్త… రైతుబంధు నిధులను విడుదల ప్రభుత్వం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rythu Bandhu : రైతన్నలకు శుభవార్త… రైతుబంధు నిధులను విడుదల ప్రభుత్వం..!

 Authored By tech | The Telugu News | Updated on :19 March 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Rythu Bandhu : రైతన్నలకు శుభవార్త... రైతుబంధు నిధులను విడుదల ప్రభుత్వం..!

Rythu Bandhu : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పటికే ఇచ్చిన 6 హామీలలో 5 హామీలను అమలు చేశామని చెబుతున్నారు. అయితే దీనిలో మహాలక్ష్మి యోజనలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం , అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ , గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు , ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలను అదేవిధంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తుంది. ఇక ఈ 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ఇప్పుడు 10 లక్షలు చేసిన సంగతి కూడా తెలిసిం దే.

ఇది ఇలా ఉంటే గత ప్రభుత్వం రైతుబంధు యోజన ద్వారా ఎకరాకు 10వేల రూపాయలను రైతుల ఖాతాలలో వేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రైతుబంధు యోజన ద్వారా రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధు ఇంకా పూర్తవలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా రోజులుగా ఈ విధానాన్ని అమలు చేసేందుకు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రైతుబంధును వారం రోజుల్లో పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ రైతు యోజన పథకంలో ముందుగా ఎకరంలోపు భూమి కలిగి ఉన్న రైతులకు ప్రభుత్వం రైతుబంధు డబ్బు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. అనంతరం 3 నుంచి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతుబంధు అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది కానీ ఇంకా చాలామందికి రైతుబంధు రాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాలి.

ఈ నేపథ్యంలోనే చాలామంది రైతులు అధికారులకు మొరపెట్టుకున్నారు. అయితే ఎట్టకేలకు వారి నిరీక్షణ ముగిసింది అని చెప్పాలి. ఎందుకంటే తాజాగా 3 నుంచి 5 ఎకరాలు కలిగిన రైతులకు ఈరోజు మధ్యాహ్నం నుండి రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశాలలో రాష్ట్రంలో దాదాపు 93 శాతానికి పైగా రైతులకు రైతుబంధు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రైతుబంధును కాంగ్రెస్ ప్రభుత్వం విడతల వారీగా విడుదల చేస్తూ వస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది