Rythu Bandhu : గుడ్ న్యూస్… రైతు ఖాతాల్లోకి రైతు బంధు జమ…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rythu Bandhu : గుడ్ న్యూస్… రైతు ఖాతాల్లోకి రైతు బంధు జమ…!

Rythu Bandhu : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రైతుబంధు ఒకటి. ఇప్పటివరకు కొంత మొత్తమే రైతు అకౌంట్లోకి డబ్బు జమ అయ్యింది.. ఇంకా చాలామందికి రైతుబంధు పడకపోగా అందరూ ఆందోళన చెందుతున్నారు.. అలాంటి వారి అందరి కోసం తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గుడ్ న్యూస్ చెప్పారు.. ఎకరం లోపు ఉన్న రైతులు ఆకౌంట్లోకి తొందరగా నిధులు జమ చేసిన అప్పటి నుంచి రైతులకు ఆర్థిక సాయం ఇవ్వడం లేదు.. మూడు నాలుగు […]

 Authored By ramu | The Telugu News | Updated on :22 April 2024,6:30 pm

ప్రధానాంశాలు:

  •  Rythu Bandhu : గుడ్ న్యూస్... నేడు రైతు ఖాతాల్లోకి రైతు బంధు జమ...!

Rythu Bandhu : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రైతుబంధు ఒకటి. ఇప్పటివరకు కొంత మొత్తమే రైతు అకౌంట్లోకి డబ్బు జమ అయ్యింది.. ఇంకా చాలామందికి రైతుబంధు పడకపోగా అందరూ ఆందోళన చెందుతున్నారు.. అలాంటి వారి అందరి కోసం తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గుడ్ న్యూస్ చెప్పారు.. ఎకరం లోపు ఉన్న రైతులు ఆకౌంట్లోకి తొందరగా నిధులు జమ చేసిన అప్పటి నుంచి రైతులకు ఆర్థిక సాయం ఇవ్వడం లేదు.. మూడు నాలుగు ఎకరాల లోపు ఉన్నవారికి రైతుబంధు సాయం పంపిణి పూర్తయిందని అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు రైతుబంధు డబ్బులు జమ అవ్వని రైతులు చాలా మంది ఉన్నారు.

ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందరికీ శుభవార్తను తెలియజేశారు.. రేపు అయిదు ఎకరాల రైతులందరికీ రైతుబంధు డబ్బులు జమ చేస్తామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ విషయం తెలిసి రైతుబంధు డబ్బులు ఇంకా జమ చేయని రైతులు సంతోషంతో పొంగిపోతున్నారు.. రైతుబంధు పంపిణీ పది రోజులలో పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు. లోక్ సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి రాకమునుపే పంపిణీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకి చెప్పడం జరిగింది. ఈ నేపద్యంగా రైతు సోదరులకు ఇంకా 3,500 కోట్ల రూపాయలు అవసరమని అధికారులు రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. డబ్బులు రిలీజ్ చేస్తామని వెంటనే పంపిణీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

Rythu Bandhu గుడ్ న్యూస్ నేడు రైతు ఖాతాల్లోకి రైతు బంధు జమ

Rythu Bandhu : గుడ్ న్యూస్… నేడు రైతు ఖాతాల్లోకి రైతు బంధు జమ…!

కానీ అది ఇంకా జరగలేదు.. ఈ మేరకు మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియామవళి అమల్లోకి రావడం జరిగింది. ఎన్నికల కోడ్ నియామవళి అమలతో రైతుబంధు యోజన ఆగిపోయింది. ఎన్నికలు ముగిసే వరకు రైతులకు డబ్బులు చెల్లించే పరిస్థితి ఉండదని భావించిన ఈ వార్త రైతుల్లో ఉత్సాహం నింపింది.. ఇకనుండి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా వస్తుందని ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు సంఖ్య 62.34 లక్షల కాగా ఎకరం నుండి రెండు ఎకరాలు ఉన్న రైతులు సంఖ్య 16.98 లక్షలు.. ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ఎలక్షన్ అయిపోయిన మరునాడు నుంచి మళ్లీ మిగిలిన రైతు ఖాతాల్లో జామ అవుతుందని వారు తెలిపారు..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది