Good News : గత కొన్ని సంవత్సరాల నుంచి దేశంలో గ్యాస్ ధరలు ఏ రేంజ్‌లో పెరుగుతున్నాయో మనం చూస్తున్నాం. 14.5 కేజీల డొమస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ఒకప్పుడు 1000 రూపాయలకు పైనే ఉంది. కేంద్ర ప్రభుత్వం సబ్సీడీ విషయంలో మార్పులు చేయటంతో.. దిగువ మధ్య తరగతి వారికి గ్యాస్ కొనడం చాలా ఇబ్బందికర పరిస్థితిగా మారింది. అయితే తెలంగాణలో మొదటిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేసింది. ప్రధానంగా.. కాంగ్రెస్ పార్టీకి అధికారం తెచ్చిపెట్టిన ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే.. బడ్జెట్‌లోనూ ఆరు గ్యారెంటీలకు తగినట్టి కేటాయింపులు చేసింది.
ముఖ్యంగా.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌తో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ల పథకాలకు.. బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరల నుంచి సామాన్యులకు ఊరట కల్పించేందుకు గానూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, మహాలక్ష్మి పథకం కింద రూ.500కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 39 లక్షల 57 వేల 637 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది.కాగా.. ఇప్పటికే ఈ పథకం కోసం 200 కోట్లను ప్రభుత్వం వెచ్చించిందని పేర్కొ్న్నారు. కాగా… ఈ బడ్జెట్‌లో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల కోసం రూ.723 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు.
గ్యాస్ సిలిండర్ల లబ్దిదారులకు ఇక ఎలాంటి పెండింగులు లేకుండా.. సబ్సిడీ డబ్బు అందనుంది. అయితే ఈ పథకం ద్వారా 89.99లక్షల మందికి ప్రత్యక్షంగా ప్రయోజనం అందనుంది.అయితే ఇప్పటి వరకు వినియోగదారుల ఖాతాల్లో ప్రభుత్వం సబ్సీడీ జమ చేయకపోవడంతో అందరిలో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. మరో రెండు మూడు రోజులలో సబ్సీడీ జమ చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేసినట్టు టాక్. మొత్తంగా డబ్బు జమ అయ్యేందుకు నాలుగు ఐదురోజులు పట్టనున్నట్టు సమాచారం.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.