Good News : స‌బ్సీడీ జ‌మ‌పై రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న‌.. ఇంకెన్ని రోజుల స‌మ‌యం ప‌డుతుందంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Good News : స‌బ్సీడీ జ‌మ‌పై రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న‌.. ఇంకెన్ని రోజుల స‌మ‌యం ప‌డుతుందంటే..!

Good News : గత కొన్ని సంవత్సరాల నుంచి దేశంలో గ్యాస్‌ ధరలు ఏ రేంజ్‌లో పెరుగుతున్నాయో మ‌నం చూస్తున్నాం. 14.5 కేజీల డొమస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్ ధర ఒకప్పుడు 1000 రూపాయలకు పైనే ఉంది. కేంద్ర ప్రభుత్వం సబ్సీడీ విషయంలో మార్పులు చేయటంతో.. దిగువ మధ్య తరగతి వారికి గ్యాస్‌ కొనడం చాలా ఇబ్బందికర పరిస్థితిగా మారింది. అయితే తెలంగాణలో మొదటిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేసింది. […]

 Authored By ramu | The Telugu News | Updated on :8 August 2024,6:25 pm

ప్రధానాంశాలు:

  •  Good News : స‌బ్సీడీ జ‌మ‌పై రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న‌.. ఇంకెన్ని రోజుల స‌మ‌యం ప‌డుతుందంటే..!

Good News : గత కొన్ని సంవత్సరాల నుంచి దేశంలో గ్యాస్‌ ధరలు ఏ రేంజ్‌లో పెరుగుతున్నాయో మ‌నం చూస్తున్నాం. 14.5 కేజీల డొమస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్ ధర ఒకప్పుడు 1000 రూపాయలకు పైనే ఉంది. కేంద్ర ప్రభుత్వం సబ్సీడీ విషయంలో మార్పులు చేయటంతో.. దిగువ మధ్య తరగతి వారికి గ్యాస్‌ కొనడం చాలా ఇబ్బందికర పరిస్థితిగా మారింది. అయితే తెలంగాణలో మొదటిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేసింది. ప్రధానంగా.. కాంగ్రెస్ పార్టీకి అధికారం తెచ్చిపెట్టిన ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే.. బడ్జెట్‌లోనూ ఆరు గ్యారెంటీలకు తగినట్టి కేటాయింపులు చేసింది.

Good News త్వ‌ర‌లోనే స‌బ్సీడీ..

ముఖ్యంగా.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌తో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ల పథకాలకు.. బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరల నుంచి సామాన్యులకు ఊరట కల్పించేందుకు గానూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, మహాలక్ష్మి పథకం కింద రూ.500కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 39 లక్షల 57 వేల 637 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది.కాగా.. ఇప్పటికే ఈ పథకం కోసం 200 కోట్లను ప్రభుత్వం వెచ్చించిందని పేర్కొ్న్నారు. కాగా… ఈ బడ్జెట్‌లో సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్ల కోసం రూ.723 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు.

Good News స‌బ్సీడీ జ‌మ‌పై రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న‌ ఇంకెన్ని రోజుల స‌మ‌యం ప‌డుతుందంటే

Good News : స‌బ్సీడీ జ‌మ‌పై రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న‌.. ఇంకెన్ని రోజుల స‌మ‌యం ప‌డుతుందంటే..!

గ్యాస్ సిలిండర్ల లబ్దిదారులకు ఇక ఎలాంటి పెండింగులు లేకుండా.. సబ్సిడీ డబ్బు అందనుంది. అయితే ఈ ప‌థ‌కం ద్వారా 89.99ల‌క్ష‌ల మందికి ప్ర‌త్య‌క్షంగా ప్ర‌యోజ‌నం అంద‌నుంది.అయితే ఇప్ప‌టి వ‌ర‌కు వినియోగ‌దారుల ఖాతాల్లో ప్ర‌భుత్వం స‌బ్సీడీ జ‌మ చేయ‌క‌పోవ‌డంతో అంద‌రిలో ఆందోళ‌న నెల‌కొంది. ఈ క్ర‌మంలో రేవంత్ రెడ్డి కీల‌క ఆదేశాలు జారీ చేసిన‌ట్టు తెలుస్తుంది. మ‌రో రెండు మూడు రోజుల‌లో స‌బ్సీడీ జ‌మ చేయాల‌ని ఆయన ఆదేశాలు జారీ చేసిన‌ట్టు టాక్. మొత్తంగా డ‌బ్బు జ‌మ అయ్యేందుకు నాలుగు ఐదురోజులు ప‌ట్ట‌నున్న‌ట్టు స‌మాచారం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది