Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం స్కీమ్ దరఖాస్తుదారులకు పండగలాంటి వార్త
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకం నిరుద్యోగ యువతకు ఆర్థిక స్వయం సాధ్యత అందించే కీలక కార్యక్రమంగా నిలిచింది. ఈ పథకం కింద అర్హులైన వారికి రూ.4 లక్షల వరకు ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఇప్పటికే వేలాది మంది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్నవారికి తాజాగా గుడ్ న్యూస్ తెలిపింది ప్రభుత్వం. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను మే 15 లోగా పరిశీలించి బ్యాంకులకు పంపించాలి అని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం మండల కన్వీనర్లు, కార్పొరేషన్ అధికారులు, జీహెచ్‌ఎంసీ ప్రతినిధులు అప్లికేషన్ల పరిశీలనపై దృష్టి సారించారు. ఇప్పటి వరకు 1.28 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 1.11 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని తెలిపారు. వీటిలో ఇప్పటికే 40 వేల దరఖాస్తులను బ్యాంకులకు పంపినట్లు సమాచారం. ఇంకా పత్రాలు సమర్పించని వారు వెంటనే తమ వార్డు కార్యాలయాల్లో సర్టిఫికెట్లు అందజేయాలని సూచించారు.

Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం స్కీమ్ దరఖాస్తుదారులకు పండగలాంటి వార్త
అలాగే జూన్ 2వ తేదీ కల్లా మంజూరు లేఖలు లబ్ధిదారులకు అందించనున్నట్టు అధికారులు తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సిబిల్ స్కోర్‌పై వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పథకం అందుతుందని స్పష్టత ఇచ్చారు. ఈ పథకం ద్వారా యువత తమేంటో నిరూపించుకోవడానికి మంచి అవకాశం లభిస్తుందని, నిరుద్యోగ సమస్యకు ఒక స్థాయిలో పరిష్కారం కలుగుతుందని పేర్కొన్నారు.