Ration Card : రేష‌న్ కార్డ్ ఉంటే ఇవి ఉచితంగా పొందండి.. ఈ శుభ‌వార్త‌త‌తో అంద‌రు ఖుష్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ration Card : రేష‌న్ కార్డ్ ఉంటే ఇవి ఉచితంగా పొందండి.. ఈ శుభ‌వార్త‌త‌తో అంద‌రు ఖుష్‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :27 April 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Ration Card : రేష‌న్ కార్డ్ ఉంటే ఇవి ఉచితంగా పొందండి.. ఈ శుభ‌వార్త‌త‌తో అంద‌రు ఖుష్‌..!

Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని రేషన్ దుకాణాల ద్వారా సామాన్య ప్రజలకు మరింత సౌలభ్యం కల్పించేందుకు కొత్త చర్యలు చేపట్టిన విష‌యం తెలిసిందే. జూన్ 2025 నుంచి రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు సబ్సిడీ ధరలకు కందిపప్పు (తూర్ దాల్), రాగులు (ఫింగర్ మిల్లెట్స్) పంపిణీ చేయనున్నారు. ఈ పథకం కోసం మూడు నెలలకు సరిపడా కందిపప్పు, సంవత్సరానికి సరిపడా రాగుల సేకరణకు టెండర్లు ఆహ్వానించారు.

Ration Card రేష‌న్ కార్డ్ ఉంటే ఇవి ఉచితంగా పొందండి ఈ శుభ‌వార్త‌త‌తో అంద‌రు ఖుష్‌

Ration Card : రేష‌న్ కార్డ్ ఉంటే ఇవి ఉచితంగా పొందండి.. ఈ శుభ‌వార్త‌త‌తో అంద‌రు ఖుష్‌..!

Ration Card శుభ‌వార్త‌..

ఈ నిర్ణయం రాష్ట్రంలోని 1.40 కోట్ల రేషన్ కార్డు హోల్డర్లకు పోషకాహారం, ఆర్థిక సౌలభ్యం అందించే లక్ష్యంతో తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు ఒక్కో వ్యక్తికి నెలకు 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తోంది సర్కార్. ఒక కుటుంబానికి గరిష్టంగా 20 కేజీల వరకు బియ్యం అందుతోంది.

ఈ బియ్యం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం ₹3/కిలో ధరకు ఇస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వం దీనిని ఉచితంగా అందిస్తోంది. అదనంగా ప్రతి రేషన్ కార్డు హోల్డర్‌కు నెలకు 1 కిలో పంచదార (షుగర్) ₹25/కిలో ధరకు ఇస్తోంది. ఇది మార్కెట్ ధర (₹40/కిలో) కంటే చాలా తక్కువ. ప్రస్తుతం కొన్ని రేషన్ దుకాణాల్లో కందిపప్పు ₹67/కిలో ధరకు అందుబాటులో ఉంది, ఇది మార్కెట్ ధర (₹180/కిలో) కంటే గణనీయంగా తక్కువ.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది