Telangana : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఇక నేరుగా అకౌంట్లలోకే జీతాలు..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :1 April 2026,8:15 pm

Telangana తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఏళ్ల తరబడి అహర్నిశలు శ్రమిస్తున్న కాంట్రాక్ట్,  ఔట్ సోర్సింగ్ Contract and Outsourcing ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏళ్లుగా వారు ఎదుర్కొంటున్న వేతన కష్టాలకు, ప్రైవేట్ ఏజెన్సీల దోపిడీకి శాశ్వత ముగింపు పలుకుతూ ఓ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై దళారుల ప్రమేయం లేకుండా, ఏప్రిల్ నెల నుంచి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే Direct Bank Transfer జీతాలు జమ చేయాలని ప్రభుత్వం తీర్మానించింది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది కార్మికులు, వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

Telangana : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఇక నేరుగా అకౌంట్లలోకే జీతాలు..!

Telangana : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఇక నేరుగా అకౌంట్లలోకే జీతాలు..!

Telangana contract employees salary update ప్రైవేట్ ఏజెన్సీల దోపిడీకి చెక్

గత కొన్నేళ్లుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్రస్థాయిలో శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ప్రభుత్వం ఏజెన్సీలకు నిధులు మంజూరు చేసినా, ఆ కాంట్రాక్టర్లు లేదా ఏజెన్సీలు సిబ్బందికి సకాలంలో జీతాలు ఇవ్వకుండా వేధింపులకు గురిచేసేవారు. పీఎఫ్ PF, ఈఎస్ఐ ESI వంటివి కట్ చేసినా అవి వారి ఖాతాల్లో జమ అయ్యేవి కావు. పైగా మధ్యవర్తులు కమీషన్ల రూపంలో కార్మికుల శ్రమను దోచుకునేవారు. తాజా ప్రభుత్వ నిర్ణయంతో ఈ మధ్యవర్తుల వ్యవస్థకు పూర్తిగా చెక్ పడనుంది. గురుకులాలు, యూనివర్సిటీలు, హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీలు, మైనార్టీ సంక్షేమ శాఖలతో పాటు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఏప్రిల్ నుంచి నేరుగా జీతాలు అందనున్నాయి.

Telangana రెగ్యులర్ ఉద్యోగుల తరహాలోనే ‘ఐఎఫ్ఎంఎస్’ (IFMS) ద్వారా జీతాలు

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులకు ‘ఇంటిగ్రేటెడ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్’ Integrated Financial Management System – IFMS పోర్టల్ ద్వారా ట్రెజరీ నుంచి నేరుగా వేతనాలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఇదే ఐఎఫ్ఎంఎస్ వ్యవస్థను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కూడా వర్తింపజేయనున్నారు. దీనికోసం అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది వివరాలను, వారి బ్యాంకు ఖాతాలను ఆధార్ కార్డులతో Aadhaar Link అనుసంధానం చేసే ప్రక్రియను పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదికలు కూడా పంపారు.

మున్సిపల్ కార్మికుల కళ్లలో వెల్లివిరుస్తున్న ఆనందం

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అత్యంత భారీ ఊరట పొందింది మాత్రం మున్సిపాలిటీ కార్మికులే Municipal Workers. జిల్లా వ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో (పీహెచ్- ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ వర్కర్లు), (నాన్ పీహెచ్- పబ్లిక్ హెల్త్ నైపుణ్య కార్మికులు అనగా పారిశుద్ధ్య కార్మికులు) వేలాది మంది పనిచేస్తున్నారు. వీరికి ప్రతి నెలా సకాలంలో వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడేవారు.

గతంలో మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లకు Tax Collection, వీరికి ఇచ్చే జీతాలకు అధికారులు ముడిపెట్టేవారు. పన్ను వసూళ్ల టార్గెట్ పూర్తి అయితేనే కార్మికులకు జీతాలు ఇస్తామనే నిబంధనలు ఉండేవి. దీంతో నెలల తరబడి వేతనాలు రాక, ఆకలి బాధలు తట్టుకోలేక, కుటుంబ పోషణ కోసం కార్మికులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల ఊబిలో కూరుకుపోయేవారు. రోడ్లు ఊడ్చే కార్మికుడికి పన్నుల వసూళ్లతో సంబంధం ఏంటని వారు ఆవేదన చెందేవారు.

ఆర్థిక భద్రత.. ఆత్మాభిమానం

తాజాగా ప్రభుత్వం తీసుకున్న ‘డైరెక్ట్ శాలరీ క్రెడిట్’ నిర్ణయంతో మున్సిపల్ కార్మికుల కష్టాలు తీరినట్లే. ఏప్రిల్ నెల నుంచి ఒకటవ తేదీ రాగానే టంగ్ మని తమ ఫోన్‌కు జీతం పడిన మెసేజ్ వస్తుందని వారు సంబరపడుతున్నారు. ఏజెన్సీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా, తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం నేరుగా తమ చేతికే అందుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల శ్రమను గుర్తించి, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రతను, వారికి ఆత్మాభిమానాన్ని కల్పించిన ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి