Telangana Police : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెండింగ్ చలాన్స్‌పై 50 శాతం రాయితీ..!
ప్రధానాంశాలు:
తెలంగాణ వాహనదారులకు భారీ ఆఫర్
ఒకేసారి రాయితీతో చలాన్స్ కట్టుకోవచ్చు
గత సంవత్సరం లాగానే మరో చాన్స్
Telangana Police : తెలంగాణకు చెందిన వాహనదారులా మీరు. మీకు తెలంగాణలో బైక్, కారు, ఇతర వాహనాలు ఉంటే మీకు కొత్తగా వచ్చిన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు గుడ్ న్యూస్ చెప్పారు. ఎందుకంటే.. ఇప్పటి వరకు మీ వాహనం పేరు మీద ఉన్న ఎలాంటి పెండింగ్ చలాన్స్ అయినా ఒకేసారి క్లియర్ చేసుకునే అవకాశం ఉంది. ఇదివరకు ఒకసారి రాయితీ ఇచ్చినట్టుగా మరోసారి రాయితీ ఇచ్చి పెండింగ్ లో ఉన్న చలాన్స్ అన్నీ ఒకేసారి పే చేసుకోవచ్చు. నిజానికి కొందరికి ఒక్కోసారి చాలా చలాన్స్ వేస్తుంటారు. రోడ్డు మీద రూల్స్ అతిక్రమించే వాహనదారులకు ఫైన్స్ వేస్తుంటారు. ఒక్కోసారి ఒక్కో వాహనం మీద చాలా చలాన్స్ పడుతుంటాయి. అవి తడిసి మోపెడు అవుతుంటాయి. అటువంటి వాళ్లు ఒకేసారి రాయితీ ద్వారా పెండింగ్ చలాన్స్ పే చేసుకోవచ్చు.
ఇప్పటి వరకు కోట్ల రూపాయలు చలానాల పేరుతో పెండింగ్ లో ఉన్నాయి. ఫైన్స్ పడ్డ వాళ్లు చాలామంది వాహనదారులు పెనాల్టీ పే చేయడం లేదు. దీంతో బకాయిలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొందరు వెంటనే అక్కడికక్కడే పోలీసులకు పే చేస్తున్నా.. మరికొందరు మాత్రం ఆన్ లైన్ లో తర్వాత చేస్తామని చెప్పడం, పోలీసులను తప్పించుకొని పోవడం చేస్తుంటారు. అందుకే ఒక్కో వెహికిల్ పై చాలా ఫైన్ పెండింగ్ లో ఉంటోంది. అందుకే.. వాటిని వాహనదారులంతా క్లియర్ చేసేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటోంది.
గత సంవత్సరం ఇలాగే భారీ ఆఫర్ ప్రకటించడంతో చాలామంది తమ ఫైన్లను పే చేశారు. 50 శాతం వరకు డిస్కౌంట్ ఇచ్చారు. దీంతో చాలామంది ఫైన్లను క్లియర్ చేశారు. తాజాగా మరోసారి కూడా పెండింగ్ చలాన్స్ క్లియర్ అయ్యేలా పోలీస్ శాఖ భారీ ఆఫర్లు ప్రకటించబోతోంది. త్వరలోనే దానికి సంబంధించిన నోటిఫికేషన్ ను పోలీస్ శాఖ విడుదల చేసే అవకాశం ఉంది.