Nagarjuan Sagar Dam : తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ ఫైట్.. ఎన్ని రోజు ఈ వివాదాలు..?
Nagarjuan Sagar Dam : ఓవైపు నవంబర్ 30న అంటే నిన్న తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే మరోవైపు నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు అక్కడ మోహరించారు. దానికి కారణం ఏంటంటే.. నవంబర్ 30న ఏపీ అధికారులు.. కుడి కాలువ కోసం నీటిని విడుదల చేసుకున్నారు. అవి దాదాపు 4 వేల క్యూసెక్కుల నీళ్లు. అయితే.. సాగర్ లో ప్రస్తుతం ఉన్నది 522 అడుగుల నీటి మట్టం మాత్రమే. […]
ప్రధానాంశాలు:
డ్యామ్ నుంచి 4000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకున్న ఏపీ అధికారులు
13వ నెంబర్ గేట్ ఏపీ పరిధిలోకి వస్తుందా?
2015 నుంచి అలాగే ఉన్న సాగర్ నీటి పంపకాల గొడవలు
Nagarjuan Sagar Dam : ఓవైపు నవంబర్ 30న అంటే నిన్న తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే మరోవైపు నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు అక్కడ మోహరించారు. దానికి కారణం ఏంటంటే.. నవంబర్ 30న ఏపీ అధికారులు.. కుడి కాలువ కోసం నీటిని విడుదల చేసుకున్నారు. అవి దాదాపు 4 వేల క్యూసెక్కుల నీళ్లు. అయితే.. సాగర్ లో ప్రస్తుతం ఉన్నది 522 అడుగుల నీటి మట్టం మాత్రమే. ఇంకో 12 అడుగులు తగ్గితే డెడ్ స్టోరేజీకి చేరుతుంది. ఈనేపథ్యంలో ఏపీ అధికారులు నీటి విడుదల చేయడం చర్చనీయాంశం అయింది. నిజానికి.. బుధవారం అర్ధరాత్రి నుంచే ఈ హైడ్రామా స్టార్ట్ అయింది. ఏపీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి డ్యామ్ వద్దకు వచ్చి అక్కడ ఉన్న బారికేడ్లను కూడా తొలగించారు. 13వ గేట్ వద్ద నీటిని విడుదల చేశారు.
దీంతో ప్రశాంతంగా ఇప్పటి వరకు ఉన్న తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ అలజడి స్టార్ట్ అయింది. నాగార్జునసాగర్ డ్యామ్ నీటి కోసం రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ లొల్లి స్టార్ట్ అయిందనే చెప్పుకోవాలి. నిజానికి.. 2015 నుంచే నాగార్జున సాగర్ నీటి పంపకాల విషయంలో గొడవ జరుగుతోంది. అప్పటి నుంచి ఈ గొడవ అలాగే ఉండిపోయింది. తాజాగా.. ఏపీ అధికారులు వచ్చి.. నీటిని విడుదల చేసుకోవడం, అలాగే.. కుడిగట్టు క్రస్ట్ గేట్ల స్విచ్ రూమ్ డోర్స్ ను పగులగొట్టడంతో ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య తోపులాట జరిగింది.
Nagarjuan Sagar Dam : కృష్ణా రివర్ బోర్డ్ ఏం చెబుతోంది?
కృష్ణా రివర్ బోర్డ్ ప్రకారం.. 13వ నెంబర్ గేటు తమ పరిధిలో ఉంటుందని ఏపీ చెబుతోంది. అందుకే అక్కడ కంచె ఏర్పాటు చేశామన్నారు. కానీ.. ఆ కంచెను తొలగించేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నించారు. కానీ.. ఏపీ పోలీసులు.. వాళ్లను అడ్డుకున్నారు. మరోవైపు కుడి కాలువ నుంచి ఏపీకి నీటి విడుదల కూడా కొనసాగుతోంది. దీంతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యులు సాగర్ డ్యామ్ వద్దకు చేరుకొని డ్యామ్ వద్ద పరిస్థితులను సమీక్షించారు. కేంద్రం కూడా రెండు రాష్ట్రాల జల వివాదంపై స్పందించింది. అక్కడి పరిస్థితులను ఆరా తీస్తోంది.