Telangana Rains : తెలంగాణ అంతటా భారీ వర్షాలు.. నిండుకుండలా మారిన జలాశయాలు
Telangana Rains : భారత వాతావరణ శాఖ అత్యంత తాజా బులిటెన్ ప్రకారం గుజరాత్ పక్కన ఉన్న అస్నా తుపాను నెమ్మదిగా పశ్చిమం వైపు కదులుతోంది. అందువల్ల దాని ప్రభావం మనపై లేనట్లే. మన వాయుగుండం ఇవాళ తీరం దాటబోతోంది. ప్రస్తుతం అది తుని, పిఠాపురం, కాకినాడ, యానాం దగ్గర్లో ఉంది. అది వాయవ్యం వైపుగా గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. అంటే.. తుని, విశాఖపట్నం మధ్యలో తీరం దాటే ఛాన్స్ ఉంది. మరోవైపు నైరుతీ […]
ప్రధానాంశాలు:
Telangana Rains : తెలంగాణ అంతటా భారీ వర్షాలు.. నిండుకుండలా మారిన జలాశయాలు
Telangana Rains : భారత వాతావరణ శాఖ అత్యంత తాజా బులిటెన్ ప్రకారం గుజరాత్ పక్కన ఉన్న అస్నా తుపాను నెమ్మదిగా పశ్చిమం వైపు కదులుతోంది. అందువల్ల దాని ప్రభావం మనపై లేనట్లే. మన వాయుగుండం ఇవాళ తీరం దాటబోతోంది. ప్రస్తుతం అది తుని, పిఠాపురం, కాకినాడ, యానాం దగ్గర్లో ఉంది. అది వాయవ్యం వైపుగా గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. అంటే.. తుని, విశాఖపట్నం మధ్యలో తీరం దాటే ఛాన్స్ ఉంది. మరోవైపు నైరుతీ రుతుపవనాలు చాలా చురుగ్గా ఉన్నాయి. ఈ పరిస్థితుల వల్ల ఏపీ, తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు వారం పాటూ కురుస్తాయి.అయితే ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చాయి.
Telangana Rains వర్షాలే వర్షాలు..
కొన్ని ప్రాంతాల్లో పోటెత్తుతున్న వరదలతో.. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో.. జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు మొత్తం జలదిగ్భందమయ్యాయి. ఎలాంటి ప్రయాణాలైనా వాయిదా వేసుకోవాలని.. కుండపోత వర్షాలు కురిసే అవకాశముందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాగులు, చెరువులు పొంగే ప్రమాదముందని.. చెరువులకు గండ్లు, రోడ్లు కొట్టుకుపోయే అవకాశాలున్నాయంటూ పేర్కొంది. నాలాలు, మ్యాన్‌హోల్స్ దగ్గర అత్యంత అప్రమత్తం అవసరమని హెచ్చరించింది.. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దంటూ ఐఎండీ పేర్కొంది.
కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడే ప్రమాదముందని పేర్కొంది. ట్రాన్స్‌ఫారం ఉన్న ప్రాంతాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.. ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు పోల్స్ దగ్గరకు వెళ్లొద్దని పేర్కొంది.. నల్లా, సంపుల్లో నీటిని కాచి వడబోసుకునే తాగాలని ఆరోగ్యశాఖ సూచించింది. డ్యామ్స్ పర్యటనలు తక్షణమే వాయిదా వేసుకోవాలని.. నీటి కుంటలు, వాగులు, నదులు, చెరువుల దగ్గర సెల్ఫీలు, రీల్స్ చేయొద్దంటూ హెచ్చరించింది.. రీ వర్షాల నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ కలెక్టర్ ప్రకటన జారీ చేశారు. అయితే ఈ భారీ వర్షాల నేపథ్యంలో మరిన్ని సెలవులు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.