Hyderabad Sperm Scam : వామ్మో.. బిర్యానీ , ఆ వీడియోలు చూపించి బిచ్చగాళ్ల నుండి వీర్యం సేకరణ..!
ప్రధానాంశాలు:
Hyderabad Sperm Scam : బిర్యానీ , ఆ వీడియోలు చూపించి బిచ్చగాళ్ల నుండి వీర్యం సేకరణ..!
Hyderabad Sperm Scam : సికింద్రాబాద్‌లో ఇండియన్ స్పెర్మ్ టెక్ క్రయోసిస్టమ్ క్లినిక్ పేరిట చోటుచేసుకున్న శిశు వ్యాపార దందా అందర్నీ షాక్ కు గురి చేస్తోంది. బిచ్చగాళ్లు, అడ్డా కూలీలను వీర్య దాతలుగా వాడుతూ, కాస్త చదువు కున్న వారికి రూ.1000 నుంచి రూ.4000 వరకు, మహిళలకు రూ.20,000 నుంచి రూ.25,000 వరకూ ఇచ్చి వీర్యం, అండాలను సేకరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాల చవిస్తున్న పంకజ్ సోనీ అనే వ్యక్తి సహా ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Hyderabad Sperm Scam : వామ్మో.. బిర్యానీ , ఆ వీడియోలు చూపించి బిచ్చగాళ్ల నుండి వీర్యం సేకరణ..!
Hyderabad Sperm Scam : హైదరాబాద్ లో దారుణం.. బిచ్చగాళ్లకు బిర్యాని, అడ్డా కూలీలకు మద్యం ఇచ్చి వీర్యం, అండాల సేకరణ
అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ART) చట్టాల ప్రకారం.. 21 నుంచి 55 ఏళ్ల మధ్య ఆరోగ్యవంతులైన వ్యక్తుల నుంచే, వైద్యపరీక్షల తర్వాత మాత్రమే వీర్యం సేకరించాల్సి ఉంటుంది. కానీ ఈ క్లినిక్‌లో నిబంధనలన్నింటిని తుంగలో తొక్కి, వారానికోసారి ఒకే వ్యక్తి నుంచి వీర్యం తీసుకుంటూ, అదే వారిని రెగ్యులర్‌గా ఉపయోగిస్తున్నారు. వీరికి బిర్యానీ, మందుతో లాలిచ్చి, కొన్ని నోట్లతో మోసం చేసి వారి నుంచి శాంపిళ్లను సేకరిస్తున్నారు. అంతేకాదు, బిచ్చగాళ్లు, కూలీలు తమకు తెలిసిన మహిళలను తీసుకొచ్చినపుడే వారికి బహుమతులుగా అదనపు డబ్బులు ఇవ్వడం ద్వారా అండాల సేకరణకూ దారితీశారు.
ఈ ప్రక్రియ అంతా తప్పుడు పద్ధతులపై ఆధారపడినదే కాకుండా, జన్యువ్యాధులు, అంటువ్యాధుల అవకాశాలను విపరీతంగా పెంచే ప్రమాదకరమైన ప్రక్రియగా మారింది. పోలీసులు ఈ ఘోర దందాపై లోతైన దర్యాప్తు ప్రారంభించగా, ఇంకా అనేక వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. గోపాలపురం పోలీసులు నిందితులను మళ్లీ కస్టడీకి తీసుకోవడానికి కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం.