Hyderabad Water Supply : 2050 వరకు సరిపడా హైదరాబాద్ మంచినీటి సరఫరాకు ప్రణాళిక.. సీఎం రేవంత్
Hyderabad Water Supply : రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన హైదరాబాద్ జలమండలి బోర్డు Hyderabad Water Supply తొలి సమావేశం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగింది. తాగునీటితో పాటు భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగా సివరేజీ ప్రణాళికను రూపొందించడంలో ఏజెన్సీలు, కన్సల్టెన్సీలతో అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు.ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో జనాభాకు సరిపడే విధంగా తాగునీటి సరఫరా చేస్తున్నామని, నీటి సరఫరాకు నగరంలో మొత్తం 9.800 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ద్వారా 13.79 లక్షల కనెక్షన్లతో నీటి సరఫరా చేస్తున్నట్టు సమావేశంలో అధికారులు వివరించారు.నగరానికి మంజీరా, సింగూరు, గోదావరి, కృష్ణా నుంచి నీటి సరఫరా జరుగుతుండగా, గోదావరి ఫేజ్ 2 ద్వారా మరింత నీటిని తరలించి ఉస్మాన్‌సాగర్ , హిమాయత్‌సాగర్ వరకు తాగునీటి సరఫరాకు డిజైన్ చేసిన ప్రాజెక్టుపై సమావేశంలో చర్చ జరిగింది.
Hyderabad Water Supply నగరంలో పలు ప్రాంతాలకు మంజీరా నీటిని సరఫరా
హైదరాబాద్ తాగునీటి అవసరాలకు సంబంధించి కన్సల్టెన్సీ ఇచ్చిన నివేదిక ఆధారంగా నీటి లభ్యత, లిఫ్టింగ్ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని మల్లన్నసాగర్ నుంచే గోదావరి ఫేజ్-2 తాగునీటి సరఫరా ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. గతంలో ప్రతిపాదించిన 15 టీఎంసీలకు బదులు, సిటీ అవసరాల దృష్ట్యా 20 టీఎంసీల నీటిని తరలించేలా మార్పులకు ఆమోదం తెలిపారు.హైదరాబాద్ జలమండలి ఆదాయ వ్యయాల నివేదికను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించగా, జలమండలి తమ సొంత ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని, అందుకు అనుసరించాల్సిన విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి గారు సూచించారు.
జలమండలి కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధులను సమకూర్చుకోవాలని, తక్కువ వడ్డీతో రుణాలు తెచ్చుకునే ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అందుకు వీలుగా ప్రాజెక్టు డీపీఆర్లు తయారు చేయించాలని చెప్పారు.నగరంలో పలు ప్రాంతాలకు మంజీరా ద్వారా 1965 నుంచి నీటిని సరఫరా చేస్తున్న పైపులైన్లకు కాలం చెల్లిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా మరో అధునాతన లైన్ నిర్మించేలా కొత్త ప్రాజెక్టు చేపట్టాలని ఆదేశించారు.