Rythu Bharosa : వారికే రైతు భరోసా.. ప్రభుత్వం పెట్టిన మార్గదర్శకాలు ఇవే..!
ప్రధానాంశాలు:
Rythu Bharosa : వారికే రైతు భరోసా.. ప్రభుత్వం పెట్టిన మార్గదర్శకాలు ఇవే..!
Rythu Bharosa : రైతు భరోసా కోసం తెలంగాణ అన్నదాత ఆశగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. రైతులకు పథకం డబ్బు అందకుండా చేస్తున్నారని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఆ దిశగా స్పీడ్ పెంచుతోంది. సంక్రాంతి కే రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ కూడా తీర్మానం చేయడంతో విధివిధానాల రూపకల్పనపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఇందులో భాగంగా రైతు భరోసా ఎవరికి ఇవ్వాలని, ఎవరికి ఇవ్వొద్దనే దానిపై కసరత్తు చేస్తున్నారు.
Rythu Bharosa కేబినేట్ భేటిలో..
ఈ మేరకు ఆర్దికంగా నిధుల సమీకరణ కొనసాగిస్తూనే .. అర్హతల పైన తుది కసరత్తు జరుగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి నాయకత్వంలో మంత్రివర్గ ఉప సంఘం నేటి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సాగు చేసే భూములకే భరోసా నిధులు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. సాగు చేయని భూములను ఇస్తే ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయటమే అనే అభిప్రాయం తో ప్రభుత్వం ఉంది. ప్రధానంగా సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా చెల్లించాలని, దాంతో పాటు ఎకరాల విషయంలో కొంత కటాఫ్ పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
7 నుంచి 10 ఎకరాల లోపు భూములు ఉన్న వారికే రైతు భరోసా చెల్లించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. గూగుల్ డేటా, శాటిలైట్ ఆధారంగా సాగు విస్తీర్ణం లెక్కించేందుకు పలు కంపెనీల నుంచి డేటా సేకరిస్తోంది. అలాగే టాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసా అనర్హులుగా ప్రకటించాలని సూచనప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై జనవరి 4న క్యాబినెట్ భేటీలో చర్చించాలని నిర్ణయించారు. ప్రస్తుతంగా సాగు లో ఉన్న భూములను రైతు భరోసా ఇవ్వనున్నారు. అయితే, పరిమితి పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తొలుత పది ఎకరాల వరకు పరిమితం చేయాలనే మెజార్టీ అభిప్రాయం వచ్చినా.. మొత్తంగా రాష్ట్రంలో సాగులో ఉన్న భూములు.. రైతులకు సంబంధించి పూర్తి సమాచారం సేకరించిన తరువాత ఏడు ఎకరాలకు పరిమితం చేసే అంశం పైన ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయి.