Hydra : దూకుడు పెంచిన హైడ్రా.. మాదాపూర్‌లో అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా
ప్రధానాంశాలు:
Hydra : దూకుడు పెంచిన హైడ్రా.. మాదాపూర్‌లో అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా
Hydra : కొద్ది రోజుల క్రితం హైడ్రా పేరు ఎవరికి తెలియదు. కాని ఇప్పుడు హైడ్రా అక్రమార్కులకు వణుకు పుట్టిస్తోంది. అక్రమార్కుల నుంచి చెరువులను కాపాడుతోంది. ఇప్పటికే చాలా వరకు అక్రమా నిర్మాణాలను కూల్చివేసింది. అక్రమార్కులు ఎవరు అనేది లెక్క చేయకుండా ముందుకెళ్తోంది. ఇప్పటికే దాదాపు 18 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కుల చెర నుంచి రక్షించింది. సినీ హీరో నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేసింది. తుమ్మిడికుంట చెరువు కబ్జా చేసి నిర్మించిన ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను కూల్చి వేశారు. ఆక్రమణలు చేసిన అక్రమార్కుల పాలిట ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ఆదివారం మరిన్ని కూల్చివేతలు చేపట్టింది.
Hydra హైడ్రా కొరడా…
అమీన్ పూర్ పెద్ద చెరువు వద్దకు చేరుకున్న హైడ్రా అధికారులు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చేస్తు్నారు. ఆక్రమణలతో అమీన్‌పూర్ పెద్ద చెరువు కుంచించుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగి.. ఎఫ్టీఎల్‌లో నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. ప్రహరీ గోడ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైసీపీ నేత కాటసాని రాంభూపాల్‌రెడ్డికి చెందిందిగా సమాచారం. మాదాపూర్, బోరబండ, బాచుపల్లి, అమీన్ పూర్ లలో ఏకకాలంలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంది. అదే విధంగా.. సున్నం చెరువు, కత్వా చెరువు పరిధిలోని పలు ఆక్రమణల కూల్చివేత కార్యక్రమం చేపట్టింది. స్థానిక పోలీసుల సహాయంతో బందోబస్తు చేపట్టి.. మరీ కూల్చివేతలు చేపట్టింది.
మాదాపూర్, బోరబండ, బాచుపల్లి, అమీన్ పూర్ లలో ఏకకాలంలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంది. అదే విధంగా.. సున్నం చెరువు, కత్వా చెరువు పరిధిలోని పలు ఆక్రమణల కూల్చివేత కార్యక్రమం చేపట్టింది. స్థానిక పోలీసుల సహాయంతో బందోబస్తు చేపట్టి.. మరీ కూల్చివేతలు చేపట్టింది. ఎంతో కష్టపడి ఈ ఇళ్లను కొనుక్కున్నామని, తమను అన్యాయం చేయడం ఏంటని కూడా స్థానికులు ప్రశ్నిస్తున్నారు. డబ్బులున్న వారిని, రాజకీయనాయకుల్ని వదిలేసి.. పేదల మీద మీ ప్రతాపం ఏంటని కూడాఆవేధన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది ఏకంగా ఒంటి మీద కిరోసిన్ పోసుకుని కూల్చివేతలకు అడ్డుపడ్డారు. దీంతో అక్కడ ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. శేరిలింగంపల్లి నియోజక వర్గం, మాదాపూర్ లో సున్నం చెరువు దగ్గరు కూల్చివేతల దగ్గర ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి . తమ ఇళ్లనిర్మాణాల్ని వెంటనే ఆపేయాలని కూడా స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు.