Indiramma House : ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారులకి శుభవార్త.. చౌకగా ఆ రెండు..!
ప్రధానాంశాలు:
Indiramma House : ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారులకి శుభవార్త.. చౌకగా ఆ రెండు..!
Indiramma House : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్. ఈ పథకం కింద ప్రభుత్వం ఇల్లు కట్టుకునే వారికి నాలుగు దశల్లో రూ. 5 లక్షలను వారి ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పునాది పనులు కూడా చేపట్టలేని వారికి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇంటి నిర్మాణానికి అధికంగా అవసరమయ్యే సిమెంట్, ఉక్కు ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Indiramma House : ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారులకి శుభవార్త.. చౌకగా ఆ రెండు..!
Indiramma House మంచి అవకాశం..
తక్కువ ధరలకు సిమెంట్, ఉక్కు సరఫరా చేయాలని కోరుతూ నిర్మాణ సంస్థలతో ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సిమెంట్ బస్తా ధర రూ. 320 ఉండగా, పథకం కోసం రూ. 260కి సరఫరా చేయాలని అధికారులు కోరారు. అలాగే.. మార్కెట్లో ఉక్కు టన్ను ధర రూ. 50,000 నుండి రూ. 55,000 మధ్య ఉండగా.. పథకానికి రూ. 47,000కు సరఫరా చేయాలని కోరారు.
ఒక్కో ఇంటికి 180 సిమెంట్ బస్తాల చొప్పున ఈ ఏడాది 4 లక్షల 50 వేల ఇళ్లకు 9 మిలియన్ టన్నుల సిమెంట్, ఒక్కో ఇంటికి 1500 కిలోల ఉక్కు చొప్పున 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉక్కు అవసరమని అధికారులు కంపెనీల ప్రతినిధులకు వివరించారు. రాబోయే 5 సంవత్సరాలలో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఇందిరమ్మ గృహాలను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన తెగల్లో అత్యంత వెనుకబడిన చెంచు వర్గానికి ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రాధాన్యం కల్పించనున్నట్లు ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.