Indiramma Housing Scheme : ఇందిరమ్మ పథకం స్పీడ్ చేయాలనీ కీలక నియామకాలకు ప్రభుత్వం ఆమోదం
ప్రధానాంశాలు:
Indiramma Housing Scheme : ఇందిరమ్మ పథకం స్పీడ్ చేయాలనీ కీలక నియామకాలకు ప్రభుత్వం ఆమోదం
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంకి గట్టి బలం లభించబోతోంది. మొదటి విడతలో 70,122 మందికి ఇళ్ల మంజూరు పత్రాలు అందగా, ఇప్పటివరకు 2,500 మంది బేస్‌మెంట్ వరకు నిర్మాణం పూర్తి చేశారు. ప్రభుత్వం వారి ఖాతాల్లో లక్ష రూపాయలు జమ చేసింది. అయితే, ఈ నిధుల విడుదల కోసం బేస్‌మెంట్ స్థాయిలో ఇంటిని అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పరిశీలించి ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పథకాన్ని వేగంగా అమలు చేయాలనే ఉద్దేశంతో, ఔట్ సోర్సింగ్ ద్వారా 390 ఏఈల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చారు.

Indiramma Housing Scheme : ఇందిరమ్మ పథకం స్పీడ్ చేయాలనీ కీలక నియామకాలకు ప్రభుత్వం ఆమోదం
Indiramma Housing Scheme : ఇందిరమ్మ పథకం పై స్పీడ్
ఈ పోస్టుల కోసం దాదాపు 10,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, ఇటీవలే ఎంపిక ప్రక్రియ పూర్తైంది. ఏప్రిల్ 23న నియామక ఉత్తర్వులు జారీ చేసి, మే మొదటి వారం నుంచి విధుల్లోకి దింపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (నాక్) కార్యాలయంలో వారం రోజుల శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఈ శిక్షణలో ఇళ్ల నిర్మాణ నిబంధనలు, లబ్దిదారుల ఎంపిక, పర్యవేక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. వీరికి నెలకు రూ.33,800 జీతం చెల్లించనున్నారు. సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను మెరిట్ ఆధారంగా ఎంపిక చేశారు.
ప్రస్తుతం ప్రతి మండలానికి కనీసం ఒక్క ఏఈ ఉండేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. టీజీపీఎస్‌సీ ద్వారా శాశ్వత నియామకానికి దాదాపు ఏడాది సమయం పడుతుందని అంచనా వేస్తూ, అప్పటివరకు ఔట్ సోర్సింగ్ ఏఈలతో పథకాన్ని ముందుకు నడిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం కావడంలో ఏఈల పాత్ర కీలకంగా ఉండే అవకాశం ఉంది.