Jagadish Reddy : నిజం అయితే మీ చెప్పా పగలకొడతా.. తప్పు అయితే నా చెంప పగలగొట్టండి.. జగదీష్ రెడ్డి వీడియో !
ప్రధానాంశాలు:
లేని గొప్పలు చెప్పుకోవడం రేవంత్ కు బాగా అలవాటే - జగదీశ్ రెడ్డి
Jagadish Reddy : నిజం అయితే మీ చెప్పా పగలకొడతా.. తప్పు అయితే నా చెంప పగలగొట్టండి.. జగదీష్ రెడ్డి !
Jagadish Reddy : Telangana CM తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి Revanth reddy పై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తిరుమలగిరిలో సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఆయన మీడియా ముందుకు వచ్చారు. ‘‘రేవంత్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారో చెప్పుకోలేరు, అందుకే లేని గొప్పలు చెబుతుంటారు. తిరుమలగిరిలో జరిగిన సభకు ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో బూతులు మాట్లాడే స్థితికి దిగజారారు’’ అంటూ ఆయన ధ్వజమెత్తారు. రేవంత్ నిత్యం తన స్థాయిని మరచి మాట్లాడుతున్నారని ఆరోపించారు.
Jagadish Reddy : నిజం అయితే మీ చెప్పా పగలకొడతా.. తప్పు అయితే నా చెంప పగలగొట్టండి.. జగదీష్ రెడ్డి వీడియో !
Jagadish Reddy రేషన్ కార్డు ల విషయంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెంప దెబ్బకు సిద్ధం
నీటి విషయంలో రేవంత్‌కు అజ్ఞానం స్పష్టంగా బయటపడుతోందని, ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన విషయాలనే తెలంగాణకు హానికరంగా మీడియా ముందు చెబుతున్నారని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ‘‘రేవంత్ తన గురువు చంద్రబాబుకు గురుదక్షిణగా కృష్ణా, గోదావరి నదుల జలాలను అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బనకచర్ల ప్రాజెక్టుకి మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశంతో మేడిగడ్డను తాకట్టు పెట్టారు’’ అని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ, సుందిల్ల పంపు హౌస్ వంటి ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
తన హయాంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం 6.47 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేసిందని, నల్గొండ జిల్లాను ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దిందని గుంటకండ్ల గుర్తు చేశారు. ఇది నిజం అయితే మీ చెప్పా పగలకొడతా.. తప్పు అయితే నా చెంప పగలగొట్టండి అని జగదీష్ రెడ్డి అన్నారు. అలాగే 3 మెడికల్ కాలేజీలు, యాదాద్రి పవర్ ప్లాంట్, యాదాద్రి ఆలయ అభివృద్ధి ఇవన్నీ తమ హయాంలో చేశామని గుర్తు చేసారు. రేవంత్ సీఎంగా ఏ ఒక్క ప్రాజెక్టును ప్రారంభించారా?’’ అని ప్రశ్నించారు. ‘‘ఇప్పుడు ఎన్నికలు వస్తే నల్గొండలో 12 సీట్లు బీఆర్‌ఎస్ గెలుస్తుంది. ప్రజల చెంపదెబ్బకు నేను సిద్ధంగా ఉన్నాను, మిమ్మల్ని ప్రజలు ఎలా ఎదుర్కొంటారో చూస్తే తెలుస్తుంది’’ అంటూ సీఎం రేవంత్‌కు గట్టి సవాల్ విసిరారు.
చెంప దెబ్బకు సిద్దమేనా?
మా @BRSparty ప్రభుత్వ హయంలో మేము పంచిన రేషన్ కార్డుల సంఖ్య 6,47,479.. ఇది నిజం అయితే మీ చెప్పా పగలకొడతా.. తప్పు అయితే నా చెంప పగలగొట్టండి – మాజీ మంత్రి జగదీష్ రెడ్డి pic.twitter.com/2ZIotWaNE7
— greatandhra (@greatandhranews) July 15, 2025