Daughter : చాకలి ఐలమ్మ మునిమనవరాలు.. లవర్ కోసం కన్న తల్లిని అతి కిరాతకంగా చంపేసింది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Daughter : చాకలి ఐలమ్మ మునిమనవరాలు.. లవర్ కోసం కన్న తల్లిని అతి కిరాతకంగా చంపేసింది..!

 Authored By ramu | The Telugu News | Updated on :24 June 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  చాకలి ఐలమ్మ మునిమనవరాలు.. 14 ఏళ్ల కూతురు.. లవర్ కోసం కన్న తల్లిని అతి కిరాతకంగా చంపేసింది..!

  •  చాకలి ఐలమ్మ పరువు తీసిన ఆమె ముని మనమరాలు

  •  జీడిమెట్ల లో దారుణం...ప్రేమికుడి కోసం తల్లిని చంపేసిన కూతురు

Daughter  : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ గాయిని మరియు ఫోక్ సింగర్ అయిన అంజలి, తన సొంత కుమార్తె చేతిలోనే దారుణంగా హత్యకు గురైంది. హైదరాబాద్‌ జీడిమెట్లలో నివాసం ఉంటున్న అంజలి, తన కూతురు శ్రీతేజ..కొద్దీ రోజులుగా ఓ యువకుడితో తరుచు ఫోన్లో మాట్లాడుతుంది. దీంతో ఆమెను తల్లి మందలించింది. తనను మందలించిందనే కోపం తో శ్రీతేజ, తమ్ముడు యశ్వంత్ మరియు తన ఇన్‌స్టాగ్రామ్ ప్రేమికుడు శివల సహకారంతో తల్లిని దారుణంగా హత్య చేసింది.

Daughter చాకలి ఐలమ్మ మునిమనవరాలు లవర్ కోసం కన్న తల్లిని అతి కిరాతకంగా చంపేసింది

Daughter : చాకలి ఐలమ్మ మునిమనవరాలు.. లవర్ కోసం కన్న తల్లిని అతి కిరాతకంగా చంపేసింది..!

Daughter : చాకలి ఐలమ్మ పరువు తీసిన ఆమె ముని మనమరాలు

పదో తరగతి చదువుతున్న శ్రీతేజ‌కు, సోషల్ మీడియా ద్వారా ఆరు నెలల క్రితం శివ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త వారి మధ్య ప్రేమగా మారింది. ఈ సంబంధాన్ని అంగీకరించని తల్లి అంజలి పలుమార్లు కుమార్తెను మందలించింది. ప్రేమలో మునిగిపోయిన తేజ, తల్లిని అడ్డంగా భావించి చంపాలని నిర్ణయించుకుంది. తమ్ముడు యశ్వంత్ మరియు శివ సహకారంతో, అంజలి తలపై బలంగా కొట్టి, తర్వాత గొంతు నులిమి హత్యకు పాల్పడింది.

ఈ దారుణ ఘటనపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. మైనర్ అయిన తేజశ్రీ, ఆమె తమ్ముడు యశ్వంత్, మరియు శివను అరెస్టు చేశారు. ఈ ముగ్గురిపై హత్య కేసు నమోదు చేయడం జరిగింది. చాకలి ఐలమ్మ వారసురాలు, ప్రజా ఉద్యమానికి కీర్తిని తెచ్చిన అంజలిని తన బిడ్డలే హత్య చేయడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటన నేటి యువతలో సోషల్ మీడియా ప్రభావాన్ని, తల్లిదండ్రులపై పెరుగుతున్న వ్యతిరేకతను వెలుగులోకి తీసుకువచ్చింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది