KCR : చంద్రబాబు ఒక మూర్ఖుడు… వాడి వలనే ఇదంతా… బాబుపై కేసీఆర్ కామెంట్స్…!

Authored By Tandu Ramalingaiah | The Telugu News | Published on: April 7, 2024, 6:00 am
  •  KCR : చంద్రబాబు ఒక మూర్ఖుడు... వాడి వలనే ఇదంతా... బాబుపై కేసీఆర్ కామెంట్స్...!

KCR  : తాజాగా తెలంగాణ రాష్ట్రంలోమీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్ పై అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేసీఆర్ మాట్లాడుతూ…65 ఏళ్ల స్వతంత్ర భారతంలో చావకండి అంటూ గోడలపై రాస్తున్నా ప్రభుత్వాలని చూస్తున్నాం ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలాగైనా సరే చేనేత కార్మికులను ఆదుకోవాలని ఉద్దేశంతో ఓ ప్రణాళిక సిద్ధం చేశాం. గతంలో సిరిసిల్ల జిల్లాలో ఒకేసారి 11మంది కార్మికుల చనిపోతే అక్కడ మరోసారి అలాంటి పరిస్థితులు జరగకుండా ఉండేవిధంగా చర్యలు తీసుకున్నాం.

KCR  నేను భిక్షాటన చేసి  7 లక్షల రూపాయలని ఆర్థిక సహాయం చేశా

ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి వారిని ఆదుకునే ప్రయత్నం కూడా చేసాం. ఇప్పటికీ కూడా ఆ ట్రస్ట్ సిరిసిల్ల జిల్లాలో ఉంది. ఆ సమయంలో వారికి తెలంగాణ కచ్చితంగా వస్తుందని భరోసా ఇచ్చి తెలంగాణ వచ్చిన తర్వాత మిమ్మల్ని కచ్చితంగా మా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చామని ఈ సందర్భంగా కేసీఆర్ తెలియజేశారు. ఇక అప్పుడు అనుకున్న ప్రకారం తెలంగాణ రాష్ట్రం వచ్చింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. రెండు రకాల సంక్షేమ పథకాల ద్వారా వారికి ఉపాధి కల్పించాం.అయితే చంద్రబాబు నాయుడు అనే మూర్ఖుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒకేసారి ఏడుగురు చేనేత కార్మికులు మరణించారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడుకు నేను దండం పెట్టి కనీసం 50,000 ఇన్సూరెన్స్ ఇవ్వండి అని అడిగితే ఆ దుర్మార్గుడు ఇవ్వలేదంటూ కేసీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఆ సమయంలో నేను భిక్షాటన చేసి దానిలో వచ్చిన 7 లక్షల రూపాయలని తీసుకెళ్లి పోచంపల్లిలో చనిపోయిన కార్మిక కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశాం.

KCR : చంద్రబాబు ఒక మూర్ఖుడు... వాడి వలనే ఇదంతా... బాబుపై కేసీఆర్ కామెంట్స్...!

KCR : చంద్రబాబు ఒక మూర్ఖుడు… వాడి వలనే ఇదంతా… బాబుపై కేసీఆర్ కామెంట్స్…!

ఆ విధంగా భువనగిరిలో , ,గద్వాలలో, దుబ్బాకలో సిరిసిల్లలో ప్రతిరోజు చనిపోయే చేనేత కార్మికులను ఆదుకోవాలని ఉద్దేశంతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం వారికి మేలు జరిగే విధంగా కొన్ని పథకాలు పెట్టడం జరిగింది. దీనిలో భాగంగానే వారికి ఉపాధి కల్పించే దిశగా స్కూల్ యూనిఫామ్ లు , బతుకమ్మ చీరలు , ముస్లిం సోదరులకు బట్టలు అందించే విధంగా అవన్నీ ఆర్డర్స్ ఆ చేనేత కార్మికులకు అందించడం జరిగింది. ఆ విధంగా చేనేత కార్మికులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పాత రోజులను తీసుకువచ్చిందంటూ కేసీఆర్ తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికులను అవమానించేలా వ్యవహరిస్తుందంటూ తెలియజేశారు. ఎన్నికల ముందు ఏవైతే ఇస్తామని హామీ ఇచ్చారో అవన్నీ ఇవ్వాల్సిందిగా కోరారు.

Tandu Ramalingaiah

Author Bio Info : Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "LPG Gas : ఇండేన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్ .. బ్యాంకుల నుంచి కీల‌క అప్‌డేట్‌..!"

  2. "TDP : కలిసొచ్చే కాలం అంటే ఇదే.. టీడీపీ అధికారంతోపాటు అదృష్టం కూడా..!"

  3. "Today Horoscope : 22 నవంబర్ 2026 ఆదివారం ఈ రోజు మీ రాశి ఫలాలు.. ఎవరికి అదృష్టం? ఎవరికి ఖర్చులు?"

  4. "Cheyutha New Pensions : కొత్త పెన్షన్ల అర్హులకి సీతక్క గుడ్‌న్యూస్.. రేషన్ కార్డు, ఆధార్ సిద్ధం చేసుకోండి..!"

  5. "Red Gold Rate Today : అయ్య బాబోయ్.. ఎర్ర బంగారం ధరల్లో భారీ పతనం..!"

  6. "OnePlus Turbo 7 Pro 5G : వన్‌ప్లస్ నుంచి మరో పవర్‌ఫుల్ 5G ఫోన్?.. Turbo 7 Pro ఫీచర్లు తెలిస్తే షాక్‌..!"

  7. "Indiramma Bima Ration Card : రేషన్ కార్డు ఉన్నవారికి కీలక అప్‌డేట్‌.. ఇందిరమ్మ బీమా నమోదుకు ప్రభుత్వం కొత్త రూల్స్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp