KCR : ఎలా ఉండేవారు.. ఎలా అయిపోయారు చూడండి.. కేసీఆర్ ను అలా చూసి దు:ఖాన్ని దిగమింగుకున్న కేటీఆర్
ప్రధానాంశాలు:
కేసీఆర్ పరిస్థితి ఇలా అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు
ఒకేసారి రెండు గండాలు దాటిన కేసీఆర్
కోలుకోగానే కేసీఆర్ తదుపరి స్టెప్ ఏంటి?
KCR : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పరిస్థితి ఇలా అవుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఆయన ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఒక మైనస్ అయితే.. తన సీఎం పదవి పోయిన రెండు మూడు రోజులకే తన ఇంట్లో కింద పడటం, దాని వల్ల తుంటి ఎముక విరగడం మరో మైనస్. ఒకేసారి కేసీఆర్ కు రెండు దెబ్బలు అనుకోవాలి. దీంతో కేసీఆర్ చాలా కుంగిపోయారు. కేసీఆర్ కు తుంటి సర్జరీ చేశారు. యశోద ఆసుపత్రిలోనే 10 రోజల పాటు ఉన్నారు. తాజాగా ఆయన్ను యశోద ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. దీంతో యశోద ఆసుపత్రి నుంచి ఆయన ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంకి వెళ్లిపోయారు. హై సెక్యూరిటీ మధ్య కేసీఆర్ ఎర్రవెల్లికి వెళ్లారు.
అయితే.. మనం కేసీఆర్ ను ఎప్పుడూ గడ్డంతో చూడలేదు. ఆయన డీలాగా ఉండటం కూడా ఎప్పుడూ చూడలేదు. కానీ.. ప్రస్తుతం కేసీఆర్ ను చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఆయన ముఖంలో చిరునవ్వు లేదు. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు లోపలి నుంచి కేసీఆర్ ను వీల్ చైర్ లో సంతోష్ కుమార్ బయటికి తీసుకొచ్చారు. కేసీఆర్ డీలా పడిపోయి ఉండటాన్ని చూసిన కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్ ను అలా చూసి కేటీఆర్ షాక్ అయ్యారు. దు:ఖాన్ని దిగమింగుకున్నారు. ఎలా ఉండేవారు.. ఎలా అయిపోయారని కేసీఆర్ ను చూసి కేటీఆర్ బాధపడిపోయారు.
KCR : నన్ను చూడటానికి ఎవ్వరూ ఆసుపత్రికి రావద్దని చెప్పిన కేసీఆర్
అయితే.. కేసీఆర్ యశోద ఆసుపత్రిలో ఉన్నప్పుడు చాలామంది ఆయన్ను పరామర్శించడానికి చాలామంది ప్రముఖులు తరలివచ్చారు. దీని వల్ల ఇన్ఫెక్షన్ పెరుగుతుందని.. ఎవ్వరూ తనను చూడటానికి రావద్దని కేసీఆర్ రిక్వెస్ట్ చేశారు. వైద్య బృందం నన్ను హెచ్చరించింది. ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. దాని వల్ల నెలల తరబడి బయటికి వెళ్లలేరు అన్నారు. మీ అభిమానానికి నేను చేతులెత్తి దండం పెడుతున్నా. మీ స్వస్థలాలకు తిరిగి వెళ్లాలి. అందుకే మీకు నేను కోరేది అదే. దయచేసి ఇక్కడికి రాకండి. నేను కోలుకోగానే మళ్లీ ప్రజల్లోకి వస్తాను.. అని కేసీఆర్ కోరారు.