KCR : తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల వేడి రాజుకుంది. ముఖ్యంగా అధికార తెరాస పార్టీ ఈ స్థానంలో ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. ఇందుకోసం రెండు మూడు నెలల ముందు నుండి గులాబీ అధినేత సాగర్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఇక్కడ పోటీచేసే అభ్యర్థి ఎవరు అనేది మాత్రం ఫైనల్ కాలేదు.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరుపున సీనియర్ నేత జానారెడ్డి పోటీకి సిద్దమయ్యాడు. దీనితో ఆయన్ని ఢీ కొట్టే నేత కోసం తెరాస అధినేత అనేక సర్వేలు చేయించినట్లు తెలుస్తుంది. అభ్యర్థి ఎంపిక విషయంలో ఆయనో నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా బుధవారం అంటే ఈరోజే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
సాగర్ లో బీసీ నేతను పోటీకి దించితే మంచి ఫలితం ఉంటుందని తెరాస వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీలోని సీనియర్ మంత్రులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. చనిపోయిన నోముల నర్సింహయ్య కూడా అదే సామజిక వర్గానికి చెందిన వ్యక్తి.
దీనితో అదే వర్గానికి చెందిన నేతను పోటీకి దించాలని చూస్తున్నారు. మన్నెం రంజిత్ యాదవ్, గురువయ్య యాదవ్, శ్రీనివాస్‌యాదవ్, బాలరాజ్ యాదవ్‌ల పేర్లు జాబితాలో ఉన్నాయి. బీసీఅభ్యర్థి కాని పక్షంలో ప్రస్తుత ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, పార్టీ నేత కోటిరెడ్డిల పేర్లు సైతంపరిశీలించే వీలుంది. అయితే బీసీ సామాజిక వర్గం నేతలకే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. ఇలాంటి సమయంలో అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కొడుకు భగత్ పేరు తెరమీదకు వచ్చింది.
దుబ్బాక ఎన్నికల్లో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి టిక్కెట్ ఇస్తే ఓడిపోవటం జరిగింది. అదే సెంటిమెంట్ సాగర్ లో కూడా రిపీట్ అవుతుంది ఏమో అని కేసీఆర్ భయపడ్డాడు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు చోట్ల తెరాస విజయం సాధించటంతో ధైర్యం గా నోముల ఫ్యామిలీకి సీటు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఉప ఎన్నికలో గెలుపు కోసం ఏడుగురు మంత్రులను అక్కడే మకాం వేయించేందుకు గులాబీ బాస్ వ్యూహం వేస్తున్నట్లు పార్టీ నేతలు చెప్పుతున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావుతో పాటుగా జగదీష్రెడ్డి, నిరంజన్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్ను అక్కడే మోహరించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.