KCR : కేసీఆర్ కొత్త‌ ట్విస్ట్… తెర‌పైకి కొత్త పేరు సాగ‌ర్ టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా…? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

KCR : కేసీఆర్ కొత్త‌ ట్విస్ట్… తెర‌పైకి కొత్త పేరు సాగ‌ర్ టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా…?

KCR : తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల వేడి రాజుకుంది. ముఖ్యంగా అధికార తెరాస పార్టీ ఈ స్థానంలో ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. ఇందుకోసం రెండు మూడు నెలల ముందు నుండి గులాబీ అధినేత సాగర్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఇక్కడ పోటీచేసే అభ్యర్థి ఎవరు అనేది మాత్రం ఫైనల్ కాలేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరుపున సీనియర్ నేత జానారెడ్డి పోటీకి సిద్దమయ్యాడు. దీనితో […]

 Authored By brahma | The Telugu News | Updated on :24 March 2021,12:50 pm

KCR : తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల వేడి రాజుకుంది. ముఖ్యంగా అధికార తెరాస పార్టీ ఈ స్థానంలో ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. ఇందుకోసం రెండు మూడు నెలల ముందు నుండి గులాబీ అధినేత సాగర్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఇక్కడ పోటీచేసే అభ్యర్థి ఎవరు అనేది మాత్రం ఫైనల్ కాలేదు.

kcr new twist new name on sagar trs candidate

kcr new twist new name on sagar trs candidate

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరుపున సీనియర్ నేత జానారెడ్డి పోటీకి సిద్దమయ్యాడు. దీనితో ఆయన్ని ఢీ కొట్టే నేత కోసం తెరాస అధినేత అనేక సర్వేలు చేయించినట్లు తెలుస్తుంది. అభ్య‌ర్థి ఎంపిక విష‌యంలో ఆయ‌నో నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. దాదాపుగా బుధ‌వారం అంటే ఈరోజే ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

సాగర్ లో బీసీ నేతను పోటీకి దించితే మంచి ఫలితం ఉంటుందని తెరాస వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీలోని సీనియర్ మంత్రులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. చనిపోయిన నోముల నర్సింహయ్య కూడా అదే సామజిక వర్గానికి చెందిన వ్యక్తి.

దీనితో అదే వర్గానికి చెందిన నేతను పోటీకి దించాలని చూస్తున్నారు. మన్నెం రంజిత్‌ యాదవ్‌, గురువయ్య యాదవ్‌, శ్రీనివాస్‌యాదవ్‌, బాలరాజ్‌ యాదవ్‌ల పేర్లు జాబితాలో ఉన్నాయి. బీసీఅభ్యర్థి కాని పక్షంలో ప్రస్తుత ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, పార్టీ నేత కోటిరెడ్డిల పేర్లు సైతంపరిశీలించే వీలుంది. అయితే బీసీ సామాజిక వ‌ర్గం నేత‌ల‌కే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని స‌మాచారం. ఇలాంటి సమయంలో అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కొడుకు భగత్ పేరు తెరమీదకు వచ్చింది.

దుబ్బాక ఎన్నికల్లో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి టిక్కెట్ ఇస్తే ఓడిపోవటం జరిగింది. అదే సెంటిమెంట్ సాగర్ లో కూడా రిపీట్ అవుతుంది ఏమో అని కేసీఆర్ భయపడ్డాడు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు చోట్ల తెరాస విజయం సాధించటంతో ధైర్యం గా నోముల ఫ్యామిలీకి సీటు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఉప ఎన్నికలో గెలుపు కోసం ఏడుగురు మంత్రులను అక్కడే మకాం వేయించేందుకు గులాబీ బాస్ వ్యూహం వేస్తున్నట్లు పార్టీ నేతలు చెప్పుతున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావుతో పాటుగా జగదీష్రెడ్డి, నిరంజన్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్ను అక్కడే మోహరించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది