Telangana : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యాలరీలను అమలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో ఇప్పటికే పలు రకాల హామీలను నెరవేర్చగా తాజాగా గృహ జ్యోతి పథకం ద్వారా ప్రజలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. అయితే ప్రభుత్వం అందిస్తున్న 200 యూనిట్ల విద్యుత్ ను చాలామంది అనవసరంగా వినియోగిస్తున్నారని ఇందన శాఖ తాజావా వెలుగులోకి తీసుకువచ్చింది.అయితే అదనంగా విద్యుత్ వినియోగించినట్లయితే బిల్లు మొత్తం చెల్లించాలని నిబంధన ఉన్న విషయం తెలిసిందే. కాని ప్రస్తుతం వేసవికాలం కావడంతో విద్యుత్ కొరత ఏర్పడడంతో చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో చాలావరకు విద్యుత్ ఉత్పత్తి కూడా మందగించిందని చెప్పాలి.
ఈ నేపథ్యంలోనే ప్రజలకు విద్యుత్ సరఫరా పై కొత్త చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఇంధన శాఖ మంత్రి తెలియజేశారు. అంతేకాక రైతులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పంపుసెట్లకు దాదాపు 7 గంటల పాటు విద్యుత్ సరఫరా అందించనునట్లు ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజల డిమాండ్ మేరకు థర్మల్ విద్యుత్ కేంద్రాలలో గరిష్ట విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాక ఈసారి వర్ష బావ పరిస్థితులతో రిజర్వాయర్లు సగం మాత్రమే నిండడం వలన నీటి కొరత ఉందని తద్వారా నీటిని ఆదా చేసి అత్యంత జాగ్రత్తగా వాడుకుంటున్నట్లు తెలిపారు.అలాగే రాష్ట్రవ్యాప్తంగా సరిపడా విద్యుత్ సరఫరాను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాలో చీఫ్ ఇంజనీరింగ్ అధికారులను నియమించినట్లు తెలుస్తోంది. అలాగే దాదాపు 370 మెగావాట్ల సామర్థ్యం గల గ్యాస్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఈ విధంగా విద్యుత్ ఉత్పత్తికి కొన్ని రకాల చర్యలను చేపట్టి విద్యుత్ కొరత లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.