Telangana : విద్యుత్ కొరతపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Telangana : విద్యుత్ కొరతపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం…!

Telangana  : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యాలరీలను అమలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో ఇప్పటికే పలు రకాల హామీలను నెరవేర్చగా తాజాగా గృహ జ్యోతి పథకం ద్వారా ప్రజలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. అయితే ప్రభుత్వం అందిస్తున్న 200 యూనిట్ల విద్యుత్ ను చాలామంది అనవసరంగా వినియోగిస్తున్నారని ఇందన శాఖ తాజావా వెలుగులోకి తీసుకువచ్చింది.అయితే అదనంగా విద్యుత్ వినియోగించినట్లయితే బిల్లు మొత్తం […]

 Authored By ramu | The Telugu News | Updated on :12 April 2024,8:00 am

Telangana  : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యాలరీలను అమలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో ఇప్పటికే పలు రకాల హామీలను నెరవేర్చగా తాజాగా గృహ జ్యోతి పథకం ద్వారా ప్రజలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. అయితే ప్రభుత్వం అందిస్తున్న 200 యూనిట్ల విద్యుత్ ను చాలామంది అనవసరంగా వినియోగిస్తున్నారని ఇందన శాఖ తాజావా వెలుగులోకి తీసుకువచ్చింది.అయితే అదనంగా విద్యుత్ వినియోగించినట్లయితే బిల్లు మొత్తం చెల్లించాలని నిబంధన ఉన్న విషయం తెలిసిందే. కాని ప్రస్తుతం వేసవికాలం కావడంతో విద్యుత్ కొరత ఏర్పడడంతో చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో చాలావరకు విద్యుత్ ఉత్పత్తి కూడా మందగించిందని చెప్పాలి.

Telangana  : ఇంధన శాఖ మంత్రి వివరణ…

ఈ నేపథ్యంలోనే ప్రజలకు విద్యుత్ సరఫరా పై కొత్త చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఇంధన శాఖ మంత్రి తెలియజేశారు. అంతేకాక రైతులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పంపుసెట్లకు దాదాపు 7 గంటల పాటు విద్యుత్ సరఫరా అందించనునట్లు ఆయన తెలిపారు.

Telangana విద్యుత్ కొరతపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana : విద్యుత్ కొరతపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం…!

Telangana  : ఏం చర్యలు తీసుకున్నారంటే…

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజల డిమాండ్ మేరకు థర్మల్ విద్యుత్ కేంద్రాలలో గరిష్ట విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాక ఈసారి వర్ష బావ పరిస్థితులతో రిజర్వాయర్లు సగం మాత్రమే నిండడం వలన నీటి కొరత ఉందని తద్వారా నీటిని ఆదా చేసి అత్యంత జాగ్రత్తగా వాడుకుంటున్నట్లు తెలిపారు.అలాగే రాష్ట్రవ్యాప్తంగా సరిపడా విద్యుత్ సరఫరాను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాలో చీఫ్ ఇంజనీరింగ్ అధికారులను నియమించినట్లు తెలుస్తోంది. అలాగే దాదాపు 370 మెగావాట్ల సామర్థ్యం గల గ్యాస్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఈ విధంగా విద్యుత్ ఉత్పత్తికి కొన్ని రకాల చర్యలను చేపట్టి విద్యుత్ కొరత లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది