Tea : ఈ రోజుల్లో చాలా మంది షుగర్ వ్యాధితో అదేనండి డయాబెటిక్ తో బాధపడుతున్నారు. ఒకప్పుడు వయసు పైబడిన వారిలో మాత్రమే ఇది కనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు వారిలో కూడా ఇది కనిపిస్తోంది. ఒకసారి ఇది వస్తే పోదు. దాని వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే షుగర్ పేషెంట్లు చాలా వరకు ఏది పడితే అది తినకుండా ఉండిపోతారు. అయితే షుగర్ ను కంట్రోల్ చేసుకోవడం కోసం చాలానే మందులు వాడినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అయితే ఇప్పుడు కొన్ని టీలు తాగితే మంచి ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రీన్ టీ వల్ల షుగర్ కంట్రోల్ అవుతుందని ఆరోగ్య నిపుణులే చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో ఉండే పాలీఫెనాల్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. దాంతో పాటు ఇందులో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బాడీకి ఇమ్యూనిటీ పవర్ పెంచుతాయి.
దాల్చిన చెక్క లో ఉండే ప్రత్యేక లక్షణాలు కూడా షుగర్ ను కంట్రోల్ చేస్తాయి. ఇన్సులిన్, సెన్సిటివిటీని మెరుగుపరిచేందుకు సాయం చేస్తాయి. ఒకకప్పు నీటిలో దాల్చిన చెక్క ముక్క వేసి కాసుపు మరిగించుకుని.. తాగితే సరిపోతుంది.
తులసి టీతో కూడా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఇందులో ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. పైగా తులసి ఆకులు హైపోగ్లైసీమిక్ ప్రభావాలు కలిగి ఉంటాయి. ఇవి కూడా బ్లడ్ లో ఉంటే షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తాయి. ఒక కప్పు నీటితో తులసి ఆకులను వేసి మరిగించుకోవాలి. ఆ తర్వాత దాన్ని వడకట్టుకుని అందులో తేనె కూడా వేసుకుని తాగవచ్చు. అలా తాగితే ఇది షుగర్ ను కంట్రోల్ చేస్తుంది.
వాముతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాముతో తయారు చేసిన టీని తాగితే షుగర్ ను బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. వాము టీని తయారు చేసేందుకు ఒకకప్పు నీటితో పావు చెంచా వామువేసి కాసేపు మరిగించుకోవాలి. ఆ తర్వాత తాగితే సరిపోతుంది. వడకట్టుకుని తాగవచ్చు లేదంటే డైరెక్టుగా కూడా తాగొచ్చు.
మెంతులతో కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ లో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసేందుకు బాగానే సాయం చేస్తుంది. ఒక కప్పు వేడి నీటిలో ఒక చెంచా మెంతులు వేసుకుని ఒక పది నిముషాలు బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత పక్కనపెట్టుకుని నిమ్మరసం వేసుకుని తాగితే సరిపోతుంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.