Home » News » Ktr Comments On Revanth Reddy
News

KTR : పెడితే గిడితే 15 రోజులు జైలులో పెడతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు.. కేటీఆర్ సంచ‌ల‌న‌ కామెంట్స్.. వీడియో !!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: June 16, 2025 8:44 pm
Advertisement

KTR  : ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణ అనంతరం మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఈ కార్ రేస్ కేసుపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని కోరితే పారిపోయారని కేటీఆర్ విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగినందుకే తనపై తప్పుడు కేసులు పెట్టారని కేటీఆర్ ఆరోపించారు.

Advertisement

KTR : పెడితే గిడితే 15 రోజులు జైలులో పెడతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు.. కేటీఆర్ సంచ‌ల‌న‌ కామెంట్స్

KTR  సంచ‌ల‌న కామెంట్స్

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తాను తప్పు చేయలేదని కేటీఆర్ అన్నారు. ఈ ఫార్ములా కేసులో ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదన్నారు.‘నాలుగు గోడల మధ్య కాదు నాలుగు కోట్ల మధ్య చర్చిద్దామని అసెంబ్లీలో అడిగితే రేవంత్ రెడ్డి పారిపోయారు. లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమని అన్నప్పటికీ పత్తా లేరు. మళ్లీ విచారణకు పిలిచినా చట్టంపై గౌరవంతో వెళ్లాను. ఉదయం నుంచీ ఒకటే ప్రశ్న తిప్పి తిప్పి అడిగారు.

Advertisement

ఒక్కపైసా కూడా అవినీతి జరగలేదు. అవినీతి ఎక్కడుందని ఏసీబీ అధికారులను అడిగాను. పైనుంచి రాసిచ్చిన ప్రశ్నలు తప్ప విచారణలో ఏమీ లేదు. పరిపాలన చేయకాదు, హామీలు నెరవేర్చే దమ్ము లేదు. చేతకాని రాజకీయంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పెడితే గిడితే 15 రోజులు జైలులో పెడతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు.. లొట్టపీసు ముఖ్యమంత్రి భయపడేవాడు ఎవడు లేడు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి.. నీలాగా లుచ్చా పనులు చేసి అడ్డదారిలో పదువులు కొన్న వాడు ఎవడు లేడు అంటూ దారుణ‌మైన కామెంట్స్ చేశారు కేటీఆర్..

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి