Telangana Budget : పెన్షన్ల ఊసేలేదు, ఎక్కడయ్య తులం బంగారం – బడ్జెట్ పై కేటీఆర్ ఫైర్
ప్రధానాంశాలు:
Telangana Budget : పెన్షన్ల ఊసేలేదు, ఎక్కడయ్య తులం బంగారం - బడ్జెట్ పై కేటీఆర్ ఫైర్
Telangana Budget : తెలంగాణ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3,04,965 కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లు గా కేటాయించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్ కావడంతో ప్రతిపక్షాలు దీనిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.

Telangana Budget : పెన్షన్ల ఊసేలేదు, ఎక్కడయ్య తులం బంగారం – బడ్జెట్ పై కేటీఆర్ ఫైర్
Telangana Budget బడ్జెట్ లో ‘తులం బంగారం, పెన్షన్లకు నిధుల్లేవా?’ – కేటీఆర్ సూటి ప్రశ్నలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ బడ్జెట్‌ను ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించేలా ఉందని, ముఖ్యంగా కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు గణనీయమైన నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. “నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వాటిని పూర్తిగా విస్మరించింది” అని ఆయన విమర్శించారు. మహిళలు, వృద్ధులు, రైతులు, నిరుద్యోగులు ఈ బడ్జెట్‌ను చూసి తీవ్రంగా నిరాశ చెందారని కేటీఆర్ పేర్కొన్నారు.
“తులం బంగారం పథకం, రూ.4000 పెన్షన్, మహిళలకు రూ.2500 ఆర్థిక సహాయం వంటి హామీలకు తగిన నిధులు కేటాయించలేదు” అని కేటీఆర్ అన్నారు. ఈ పథకాలు అమలు చేయాలంటే ఎక్కడి నుంచి నిధులు తీసుకురావాలనే విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత బహిరంగమైందని పేర్కొన్నారు. “హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టడమే కాదు, వాటిని అమలు చేయకపోవడం ద్వారా ప్రజల నమ్మకాన్ని తాకట్టుపెట్టింది” అని ఆయన మండిపడ్డారు.